ETV Bharat / sports

ధోనీని ఆదర్శంగా తీసుకునే ఆడుతున్నా: ప్రియమ్

author img

By

Published : Jul 17, 2020, 5:32 AM IST

మహేంద్ర సింగ్ ధోనీని ఆదర్శంగా తీసుకుని క్రికెట్​లో కొనసాగుతున్నట్లు తెలిపాడు యువ క్రికెటర్ ప్రియమ్ గార్గ్. జట్టును ఎన్నోసార్లు ఆయన ఆపద నుంచి బయటపడేశాడని వెల్లడించాడు.

ధోనీని ఆదర్శంగా తీసుకునే ఆడుతున్నా: ప్రియమ్
ధోనీని ఆదర్శంగా తీసుకునే ఆడుతున్నా: ప్రియమ్

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్​కు ప్రపంచకప్ అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతమున్న క్రికెటర్లతో పాటు యువకులకు ఆదర్శంగా ఉన్నాడు. తాజాగా మహీని స్ఫూర్తిగా తీసుకునే తాను ముందుకెళుతున్నట్లు తెలిపాడు అండర్​-19 2020 ప్రపంచకప్​ కెప్టెన్ ప్రియమ్ గార్గ్.

"నేను ధోనీ సార్​ను ఫాలో అవుతా. ఆయన నాకు స్ఫూర్తి. బ్యాటింగ్​లోనైనా కెప్టెన్సీలోనైనా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా. మ్యాచ్​ ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రశాంతంగా ఉండటం ధోనీ సార్ నుంచి నేర్చుకున్నా. ఆయన బ్యాటింగ్​ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నా. కెప్టెన్​గా ఉంటూ మ్యాచ్​ను ఎలా మలుపుతిప్పుతాడో తెలుసుకున్నా."

-ప్రియమ్ గార్గ్, యువ క్రికెటర్

ఎన్నోసార్లు జట్టును ఆపద నుంచి ధోనీ బయటపడేశాడని చెప్పాడు ప్రియమ్. జట్టు 100 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన సమయంలో క్రీజులోకి వచ్చి 250 పరుగుల స్కోరును దాటించేవాడని తెలిపాడు. పాకిస్థాన్​పై మహీ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.