ETV Bharat / sports

పీకలపైకి తెచ్చుకున్న పంజాబ్‌ - ipl 2020 punjab defeat

ఈ ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆడినా ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యానికి సంబంధించిన కారణాలపై ఓ లుక్కేద్దాం.

kxip
పంజాబ్‌
author img

By

Published : Oct 11, 2020, 12:51 PM IST

165 పరుగుల లక్ష్యఛేదనలో 14.1 ఓవర్లలో 115/0తో ఉన్నారు. 35 బంతుల్లో 50 సాధించాలి. చేతిలో పది వికెట్లు. ఇలాంటి స్థితిలో ఎంతటి సాదాసీదా జట్టైనా సరే.... గెలుపుపై ధీమాతో ఉంటుంది. ఆ జట్టు, దాని అభిమానులందరూ కూడా 2 పాయింట్లు వచ్చేసినట్టే అనుకున్నారు. ఆ క్షణాన వారి అంచనాలను అందరి ముఖకవళికలు ప్రతిబింబించాయి.

ఈ డగౌట్‌లో నవ్వులు... ఆ డగౌట్‌లో డల్‌ ఫేస్‌లు... ఇక్కడ ధీమా... అక్కడ నిర్వేదం.. మరి మ్యాచ్‌కు ఆఖరికి అంతా వారనుకున్నట్టే అయిందా..? అస్సలు కాలేదు. బొమ్మ 360 డిగ్రీలూ తిరిగిపోయింది. అక్కడి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇక్కడికి... ఇక్కడివి అక్కడికి క్షణాల్లో బదిలీ అయిపోయాయి.

శనివారం సాయంత్రం జరిగిన పంజాబ్‌-కోల్‌కతా మ్యాచ్‌ ఫలితం తేలాక... 'అయ్యో..! ఈ సీజన్‌లో పంజాబ్‌ను దురదృష్టం ఇలా పట్టుకుందేంటి? గెలవాల్సిన మ్యాచ్‌లూ ఓడిపోతున్నారు?!' అని అనుకోని క్రికెట్‌ అభిమాని ఉండడేమో. ఈ భావనలో తప్పు లేదు. కానీ, నిజంగా పంజాబ్‌ ఓటమిని దురదృష్టం ఖాతాలో వేసేయగలమా..? నిజమే.. ఆఖరి బంతికి సెంటీమీటర్ల తేడాలో సిక్స్‌ మిస్‌ అయింది. కాస్త అవతల పడుంటే మ్యాచ్‌కు సూపర్‌ ఓవర్‌కు వెళ్లేది. అప్పుడు గెలిచేవారేమో...! ఇవన్నీ పక్కనపెడితే... ఆఖరి బంతి వరకూ వెళ్లాల్సిన మ్యాచేనా ఇది...? కచ్చితంగా కాదు. ఈ ఓటమి పంజాబ్‌ స్వయంకృతాపరాధం, కోల్‌కతా అదృష్టం తప్ప ఇంకోటి కాదు.

కారణాలేంటి..?

ఏ జట్టైనా తమ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది. పంజాబ్‌కు రాహుల్‌, అగర్వాల్‌ రూపంలోని ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ ఆ బాధ్యతను నెరవేర్చారు. నిన్న కూడా తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్యాట్స్‌మన్‌కు పిచ్‌ కాస్త పరీక్ష పెడుతుండటం వల్ల... వికెట్‌ కాపాడుకుంటూనే సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ పెరగకుండా చూసుకున్నారు. అయితే కనీసం 8 ఓవర్ల తర్వాతైనా స్కోరింగ్‌ వేగాన్ని పెంచాల్సింది పోయి అతిజాగ్రత్తకు పోయినట్టు కనిపిస్తోంది. ఇందుకు వారిద్దరినీ నిందించలేం. వారు ఔట్‌ అయితే... ఆ తర్వాత జట్టును కాపాడే ఆటగాడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పూరన్‌ గత మ్యాచ్‌లో మెరిశాడే తప్ప... మ్యాక్స్‌వెల్‌, కుర్రాళ్లు మన్‌దీప్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌పై ఎవరికీ అంచనాల్లేవు. ఈ భయంతోనే వికెట్‌ పడకూడదన్న సంకల్పంతో ఆడిన వారిద్దరూ... ఇన్నింగ్స్‌కు కావాల్సిన ఆ ఎక్స్‌ట్రా జోష్‌ను తీసుకురాలేకపోయారు. చివరివరకూ ఉండి మ్యాచ్‌ను గెలిపించి కీలకమైన ఆ రెండు పాయింట్లు సాధిద్దామనుకున్నారు. కానీ, అగర్వాల్ ఔట్‌ అయ్యాక వారి పతనం మొదలైంది. వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ ఓ మూడు షాట్లు కొట్టి ఔటయ్యాడు. అప్పటికి 16 బంతుల్లో 21 మాత్రమే సాధించాలి.

ఇలాంటి స్థితిలో సారథి రాహుల్‌, పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ ఓ పొరపాటు చేసిందని చెప్పుకోవాలి. మ్యాక్స్‌వెల్‌ కన్నా ముందు కుర్రాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ను పంపడం ఓ వ్యూహాత్మక తప్పిదంగా మిగిలింది. విధ్వంసక బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లో లేనప్పటికీ ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో యువ ఆటగాడ్ని పంపడంపై నిపుణులూ పెదవివిరిచారు. నాలుగోస్థానంలో వచ్చి మ్యాక్స్‌వెల్‌ మ్యాచ్‌ను గెలిపించి ఉండుంటే అతని ఆత్మవిశ్వాసమూ పెరిగి తర్వాతి పోరుల్లో జట్టుకు బలంగా మారి ఉండేవాడని అభిప్రాయపడ్డారు.

నరైన్ బౌలింగ్‌లో వరుసగా 3 డాట్స్‌ ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్.... 18వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఒత్తిడి పెరగడం వల్ల అదే ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 14 సాధించాల్సినంతగా మ్యాచ్‌ను పంజాబ్‌ మీదకు ఎక్కించుకుంది. మ్యాక్స్‌వెల్‌ 2 ఫోర్లు కొట్టినా కలిసిరాలేదు.

రాహుల్‌కు ఏమైంది?

2018లో ఆర్సీబీ నుంచి పంజాబ్‌ జట్టుకొచ్చిన రాహుల్​ తనదైన ముద్రవేశాడు. ఆ సీజన్‌లో గేల్‌తో జోడీ కట్టిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ ఫలితాలెలా ఉన్నా నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. 2019లోనూ అదే ఫామ్‌ కొనసాగించాడు. అంతకముందు భారత జట్టులోకి వస్తూ పోతూ ఉండే కేఎల్ ఈ రేంజ్‌ బ్యాటింగ్ కారణంగా స్థిరమైన చోటు సంపాదించాడు. అతని బ్యాటింగ్‌కు ముగ్ధులైన పంజాబ్‌ యాజమాన్యం ఎలాగైనా ట్రోఫీ కలను నిజం చేసే బాధ్యతను అతనిపై పెడుతూ సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా ఆర్సీబీ పోరులో రెట్టింపు వేగంతో పుంజుకుని అద్భుత శతకం సాధించాడు. ఆ తర్వాత నిలకడగానే ఆడుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 387 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ తన వద్దే ఉంచుకున్నాడు. అయితే పరుగులు విపరీతంగా సాధిస్తున్నా... అవి వస్తున్న వేగం (స్ట్రైక్‌ రేట్‌) గురించి సర్వత్రా విమర్శలు వచ్చాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన రాహుల్‌... తనకు జట్టు గెలుపే ముఖ్యమని, టీ20ల్లో స్ట్రైక్‌రేట్‌ను చాలా ఎక్కువ చేసి చూపిస్తారని (ఓవర్‌రేటెడ్‌) అని అన్నాడు. జట్టు గెలుపు ముఖ్యమనుకున్నప్పుడు అవసరాలకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేయాలి కదా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అధిక పరుగులు, అధిక అర్ధశతకాలు, ఎక్కువ ఫోర్లు అన్నీ రాహుల్‌ పేరిటే ఉన్నాయి. సగటులోనూ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ స్ట్రైక్‌రేట్‌లో టాప్‌-15లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. 2018లో పవర్‌ప్లేలో 157 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు పిండుకున్న ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్‌.... ఈ సీజన్‌కు వచ్చేనాటికి 110ల్లోకి దిగిపోయాడు. ఈ ఒక్క గణాంకమే అతను దూకుడును తగ్గించి క్రీజ్‌లో ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నట్టు చాటి చెబుతోంది. సారథిగా బాధ్యతలు అతనిపై ఈ భారాన్ని మరింత పెంచి ఉండొచ్చు. మరో ఓపెనర్ మయాంక్ ధాటిగా ఆడుతున్నందున తను సహకారం అందించి నిలదొక్కుకోవాలే తప్ప దూకుడుకు పోకూడదన్నట్టుగా అతని ఆట సాగుతోంది.

జట్టు గురించి ఎక్కువ ఆలోచిస్తూ తన సహజ ఆటను త్యాగం చేస్తున్నాడని క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌ తమ వైఫల్యాలను అధిగమించి మ్యాచ్‌లను గెలిపించగలమన్న నమ్మకాన్ని కలిగిస్తే... రాహుల్ మునపటిలా జూలు విదల్చడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి ఒకసారి కింగ్ అయితే.. ఎప్పటికీ కింగే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.