టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో చక్కగా రాణించాడని తెలిపాడు. డిసెంబరు 4 నుంచి జరగబోయే టీ20 సిరీస్‌లో చాహల్‌కు బదులుగా కుల్దీప్కు తుదిజట్టులో అవకాశం ఇవ్వాలని సూచించాడు. కనీసం తొలి మ్యాచ్‌లో ప్రయత్నించి చూడాలని పేర్కొన్నాడు.
చివరి వన్డేలో చాహల్ స్థానంలో బరిలోకి దిగిన కుల్దీప్.. మిడిల్ ఓవర్లలో చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 10 ఓవర్లలో 57 పరుగులే ఇచ్చి కామెరూన్ గ్రీన్నూ పెవిలియన్ చేర్చాడు.
ఇదీ చదవండి:టీమ్ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?
హార్దిక్ నాలుగో స్థానంలో..
కుల్దీప్తో పాటు హార్దిక్ పాండ్యా ఆటతీరుపై గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. హార్దిక్.. టీ-20ల్లో కనీసం 2-3 ఓవర్లు బౌలింగ్ చేస్తే, మిగతా బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. టాప్-3 బ్యాట్స్‌మెన్ 14 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే.. పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని తెలిపాడు.
మరోవైపు కోహ్లీ 12 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంపై గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:'టీ-20 సిరీస్‌కు ముందు గెలుపు ఉత్సాహాన్నిచ్చింది'