ETV Bharat / sports

ఐపీఎల్​లో​ అడుగుపెట్టకముందే దంచికొట్టాడు - ,Kolkata Knight Riders-tom banton

ఐపీఎల్​లో ఇంకా అడుగుపెట్టకముందే ఇంగ్లీష్ క్రికెటర్ టామ్ బాంటన్ రెచ్చిపోతున్నాడు. బిగ్​బాష్​ లీగ్​లో సోమవారం వేగవంతమైన అర్ధశతకం చేశాడు. ఇదే మ్యాచ్​లో ఇతడు వరుసగా ఐదు సిక్సులు కొట్టడం విశేషం.

tom banton-chris lynn
క్రిస్​లిన్-టామ్ బాంటన్ బీభత్సం
author img

By

Published : Jan 6, 2020, 8:10 PM IST

Updated : Jan 7, 2020, 8:59 AM IST

వచ్చే ఐపీఎల్​ కోసం కోల్​కతా నైట్​రైడర్స్ కొనుగోలు చేసిన టామ్ బాంటన్.. బిగ్​బాష్ లీగ్​లో విధ్వంసం సృష్టించాడు. బ్రిస్బేన్​ హీట్​ తరఫున దంచికొట్టాడు. సిడ్నీ థండర్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో విశ్వరూపం చూపించాడు. 16 బంతుల్లో అర్ధసెంచరీ చేసి, ఐపీఎల్​ బౌలర్లకు ముందస్తు హెచ్చరికలు పంపాడు. ఈ మ్యాచ్​లో ఇతడు వరుసగా 5 సిక్స్​లు కొట్టడం విశేషం. ఫలితంగా బ్రిస్బేన్ జట్టు.. డక్​వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 16 పరుగుల తేడాతో గెలిచింది.

వర్షం వల్ల తొలుత ఈ మ్యాచ్​ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్రిస్బేన్ బ్యాటింగ్​కు దిగింది. ఓపెనర్లు లిన్-బాంటన్ విశ్వరూపం చూపించడం వల్ల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బాంటన్-19 బంతుల్లో 56 పరుగులు.. లిన్-13 బంతుల్లో 31 పరుగులు చేశారు. ఛేదనలో థండర్స్.. 5 ఓవర్లలో 60-4తో నిలిచింది. వర్షం అడ్డంకిగా మారడం వల్ల బ్రిస్బేన్.. డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.

tom banton-chris lynn
క్రిస్​లిన్-టామ్ బాంటన్ బీభత్సం

గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో టామ్ బాంటన్​ను కోల్​కతా.. రూ.కోటికి కొనుక్కుంది. ఆ తర్వాత రోజే 29 బంతుల్లో అర్ధ శతకం చేశాడీ బ్యాట్స్​మన్. ఇప్పుడు మరోసారి తన మార్క్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. మరి ఐపీఎల్​లో ఎలా అదరగొడతాడో చూడాలి.

ఇది చదవండి: పిచ్​ను ఇస్త్రీ చేసిన సిబ్బంది.. నెట్టింట ట్రోల్స్

Viral Advisory
Monday 6th January 2020
Clients, please note the following addition to our output.
VIRAL (TENNIS): Frustrated at losing a tie-break, Benoit Paire smashes his racket during France's ATP Cup clash with Serbia in Brisbane, Australia. Already moved.
Regards,
SNTV
Last Updated : Jan 7, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.