బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టు విజయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలురికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 32 టెస్టు విజయాల ఘనతను సమం చేశాడు. అంతేకాక అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు(10) అందుకున్న భారత సారథిగా.. ధోనీని(9) వెనక్కి నెట్టి రికార్డు సృష్టించాడు.
బోర్డర్ రికార్డు సమం..
బంగ్లా టెస్టు ముందు వరకు 31 విజయాలతో ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ కంటే వెనక ఉన్న కోహ్లీ.. తాజాగా అతడిని అధిగమించాడు. అత్యధిక టెస్టు విజయాలనందుకున్న కెప్టెన్లల్లో కోహ్లీ(32) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్(52) అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్(48) రెండు, స్టీవ్ వా(41) మూడో స్థానంలో ఉన్నారు.
అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు..
అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు అందుకున్న భారత కెప్టెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 10 ఇన్నింగ్స్ విజయాలతో మహేంద్ర సింగ్ ధోనీని(9) వెనక్కి నెట్టాడు. అజారుద్దీన్ (8), సౌరభ్ గంగూలీ (7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
హ్యాట్రిక్ ఇన్నింగ్స్ విజయాలు..
సొంతగడ్డపై భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. పుణె, రాంచీ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై, ఇండోర్‌లో బంగ్లాపై కోహ్లీసేన వరుసగా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టీమిండియా 1992-93, 1993-94 సీజన్లలో కూడా ఇదే తరహాలో గెలిచింది.
ఇదీ చదవండి: దివ్యాంగురాలికి.. విరాట్ ఆత్మీయ 'ఆటోగ్రాఫ్'