ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచినా ఓడిపోతే...దానికి డీఆర్ఎస్ వంటి సాంకేతికత ఓ కారణమైతే...అది చాలా పెద్ద విషయమే. అందుకే కోహ్లీ తన అసంతృప్తిని వెల్లడించాడు. ఫలితంగా సమీక్ష విధానంపై వెల్లువెత్తిన అనుమానాలపై మళ్లీ చర్చ జరుగుతోంది.
- వివాదమేంటి...??
నాలుగో వన్డేలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం టర్నర్ ఉతుకుడే.. ఈ ఆసిస్ ఆటగాడు 27 బంతుల్లో 38 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్నప్పుడు...చాహల్ బౌలింగ్‌లో మొదట స్టంపౌట్ నుంచి తప్పించుకున్నాడు. రిషబ్‌పంత్ బంతిని అందుకోలేకపోవడంతో ఔటయ్యే ఛాన్స్ తప్పించుకున్నాడు. అదే ఓవర్‌లో టర్నర్ తరవాత బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సమీక్ష కోరిన టీమిండియా రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించింది. అయినా మూడో అంపైర్ ఔటివ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ ఘటన తర్వాతే టర్నర్ రెచ్చిపోయి 16 బంతుల్లో 46 పరుగులు బాది ఆసీస్ జట్టును టైటిల్ పోరులో నిలిపాడు.
Virat Kohli was left fuming after Ashton Turner survived this DRS call 😠😠😠
— Fox Cricket (@FoxCricket) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Did he have a point?
WATCH: https://t.co/YcTwA7JcIa #INDvAUS pic.twitter.com/xGVWS7aqcr
">Virat Kohli was left fuming after Ashton Turner survived this DRS call 😠😠😠
— Fox Cricket (@FoxCricket) March 10, 2019
Did he have a point?
WATCH: https://t.co/YcTwA7JcIa #INDvAUS pic.twitter.com/xGVWS7aqcrVirat Kohli was left fuming after Ashton Turner survived this DRS call 😠😠😠
— Fox Cricket (@FoxCricket) March 10, 2019
Did he have a point?
WATCH: https://t.co/YcTwA7JcIa #INDvAUS pic.twitter.com/xGVWS7aqcr
‘చాహల్ బౌలింగ్‌లో టర్నర్ బ్యాట్‌కు బంతి తగిలినట్లు రీప్లేలో కనిపించింది. అయినా అంపైర్ ఔటివ్వలేదు.ఈ సమీక్ష పద్ధతి సరిగ్గా లేదు. అంపైర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. డీఆర్ఎస్ పద్ధతికి స్థిరత్వం అవసరం. ప్రతిసారీ ఇదొక చర్చనీయాంశంగా మారుతోంది’.
-విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్
నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించడంతోసిరీస్ 2-2తో సమం అయింది. ఈ నెల 13 బుధవారందిల్లీలోనిఫిరోజ్ షా కోట్లా మైదానంలోఇరుజట్ల మధ్య ఫైనల్ జరగనుంది.
- ఇవీ చూడండి-->ఈ 'టర్నర్'..రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్