ETV Bharat / sports

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: మూడుకు పడిపోయిన కోహ్లీ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Jan 12, 2021, 12:45 PM IST

తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​ బ్యాట్స్​మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. సిడ్నీ టెస్టులో సెంచరీతో మెరిసిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని కాపాడుకున్నాడు. ప్రస్తుతం విలియమ్సన్ 919 పాయింట్లతో ఉండగా, స్మిత్ 900, కోహ్లీ 870 పాయింట్లతో కొనసాగుతున్నారు. అలాగే సిడ్నీ టెస్టులో అర్ధశతకం చేసిన పుజారా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి చేరగా రహానె ఓ స్థానం కోల్పోయి 7కి పడిపోయాడు.

బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్​తో సిరీస్​లో సత్తాచాటుతున్న హెజిల్​వుడ్ మూడు స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే వరుసగా విఫలమవుతున్న స్టార్క్ 8వ ర్యాంకుకు పడిపోయాడు. అశ్విన్, బుమ్రా వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నారు.

ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ర్యాంకింగ్స్ విషయానికొస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడో ర్యాంకులో ఇరుజట్లకు గట్టిపోటీ ఇస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.