ETV Bharat / sports

ఇన్​స్టా​ పోస్టు​లతో రూ. 3 కోట్లు ఆర్జించిన కోహ్లీ

లాక్​డౌన్​లో ఇన్​స్టాగ్రామ్​ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్​-10 క్రీడాకారుల జాబితాను ఓ ప్రైవేట్​ సంస్థ విడుదల చేసింది. అందులో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ స్థానం సంపాదించాడు. కేవలం మూడు ఫొటోలను పోస్ట్ చేసి ఏకంగా రూ. 3.62 కోట్లను ఆర్జించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్​బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానాన్ని ఆక్రమించాడు.

Kohli joins Ronaldo in top-10 highest-earning athletes on Instagram during lockdown
ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లతో రూ. 3 కోట్లను ఆర్జించిన కోహ్లీ
author img

By

Published : Jun 5, 2020, 4:19 PM IST

లాక్​డౌన్​లో ఇంటికే పరిమితమైన క్రీడాకారులు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​లు చేస్తూ డబ్బులూ సంపాదిస్తున్నారు. వారిలో పోర్చుగల్ ఫుట్​బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో ముందున్నాడు. లాక్​డౌన్​లో ఇన్​స్టాలో చేసిన పోస్టులతో ఏకంగా రూ 17.21 కోట్లను ఆర్జించాడు. ఇన్​స్టాలో పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించే టాప్​-10 క్రీడాకారుల్లో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ కూడా స్థానం సంపాదించాడు.

Kohli joins Ronaldo in top-10 highest-earning athletes on Instagram during lockdown
క్రిస్టియానో రొనాల్డో, విరాట్​ కోేహ్లీ

కేవలం మూడు ఫొటోలతో

మార్చి 12 నుంచి మే 14 వరకు విధించిన లాక్​డౌన్​ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల సోషల్​మీడియా ఆర్జన వివరాలను ఓ మేనేజ్​మెంట్​ కన్సల్టింగ్​ కంపెనీ సేకరించింది. ఈ విరామ సమయంలో కోహ్లీ చేసిన పోస్టుల ద్వారా రూ.3.62 కోట్లను ఆర్జించడం సహా.. ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టా పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదిస్తోన్న క్రీడాకారుల్లో ఆరో స్థానానికి చేరాడు. కేవలం మూడు ఫొటోలను షేర్​ చేయగా.. ఒక్కొక్క చిత్రానికి రూ.1.20 కోట్లను సంపాదించాడు. అదే విధంగా పోర్చుగల్ ఫుట్​బాల్​ సూపర్​స్టార్​ క్రిస్టియానో రొనాల్డో.. ఈ లాక్​డౌన్​లో ఇన్​స్టా​ పోస్టుల ద్వారా రూ.17.21 కోట్లను ఆర్జించాడని ఓ నివేదిక తెలిపింది.

లియోనెల్​ మెస్సీ

ఇన్​స్టా పోస్టుల ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న క్రీడాకారులు:

ర్యాంక్ ​ క్రీడాకారుడు క్రీడ సంపాదన
1) క్రిస్టియానో రొనాల్డో ఫుట్​బాల్​ రూ. 17.21 కోట్లు
2) లియోనల్​ మెస్సీ ఫుట్​బాల్ రూ. 11.45 కోట్లు
3) నెయ్​మెర్​ ఫుట్​బాల్​ రూ. 10.50 కోట్లు
4) షాకిల్ ఓ నీల్ బాస్కెట్​ బాల్ రూ. 5.57 కోట్లు
5) డేవిడ్​ బెక్​హామ్​ ఫుట్​బాల్​ రూ. 3.87 కోట్లు
6) విరాట్​ కోహ్లీ క్రికెట్​ రూ. 3.62 కోట్లు

ఇదీ చూడండి... ఆరోన్ ఫించ్ జట్టులో రోహిత్​కు దక్కని చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.