ETV Bharat / sports

'టెస్టుల్లో కోహ్లీ లాంటోడు ఉండాల్సిందే'

టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన కామెంటేటర్ హర్ష భోగ్లే.. ప్రస్తుతం టెస్టుల్లో విరాట్​ అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. అతడు ఆడటం వల్ల ఈ ఫార్మాట్​ చూసేవారి సంఖ్య పెరుగుతుందని, అభిమానుల్ని స్టేడియంకు రప్పించాలంటే అలాంటివాడు ఉండాల్సిందేనని అన్నాడు.

author img

By

Published : May 26, 2020, 10:55 AM IST

Kohli is the Bridge Between old and new generations of cricket fans
'కోహ్లీ ప్రేక్షకులను తిరిగి స్డేడియాలకు రప్పించగలడు'

క్రికెట్​ అభిమానుల్లో పాత తరాన్ని, కొత్త తరాన్ని కలిపే వారధి విరాట్ కోహ్లీ ఒక్కడేనని అభిప్రాయపడ్డాడు ప్రముఖ కామేంటేటర్ హర్ష భోగ్లే. ప్రస్తుత కాలంలో టెస్టు క్రికెట్​ అభివృద్ధి చెందేందుకు విరాట్​ కోహ్లీ ఓ ఆయుధంలా ఉపయోగపడతాడని అన్నాడు. టీ20ల ప్రభావంతో ఐదు రోజులు జరిగే ఫార్మాట్​కు అనేక దేశాల్లో స్డేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని.. అలాంటి వారిని తిరిగి రప్పించగలిగే సామర్థ్యం కోహ్లీకి మాత్రమే ఉందని స్పష్టం చేశాడు.

టీ20 మ్యాచ్​లకు అలవాటు పడిన ప్రేక్షకులు టెస్టు మ్యాచ్​లను వీక్షించడంపై ఆసక్తి చూపడంలేదని హర్ష అన్నాడు. ఆధునిక కాలంలో జీవన విధానాలకు తగ్గట్టు టెస్టుల​ కంటే టీ20లకు విపరీతమైన క్రేజ్​ వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

మహిళల మ్యాచ్​లకు పెరిగిన ఆదరణ

2017 మహిళా ప్రపంచకప్​, ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్​ తర్వాత మహిళల క్రికెట్​కు విశేషాదరణ లభించిందని హర్ష తెలిపాడు. ఈ క్రమంలో భారత్​లో మహిళల ఐపీఎల్​ నిర్వహించడానికి మరెంతో సమయం లేదని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి... 'కోహ్లీ నుంచి అన్నీ తీసేసుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.