టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ మోడ్రన్ హీరో అని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా అన్నాడు. సాధ్యం కానిదంటూ ఏదీ లేదనే వైఖరితో అతడు ముందుకు సాగుతున్నాడని కొనియాడాడు. కోహ్లీ ఆటిట్యూడ్‌కి ఎక్కువ మంది అభిమానులున్నారని ఓ డాక్యుమెంటరీ వీడియోలో కోహ్లీ గురించి ప్రస్తావించాడు.
"భారత్‌లో కోహ్లీ ఆటిట్యూడ్‌ను ఇష్టపడతారు. ఎందుకంటే అతడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. కోహ్లీ ఓ మోడ్రన్ హీరోను తలపిస్తున్నాడు".
- స్టీవ్ వా, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్
భారత్‌లో క్రికెట్‌కు లభించే ఆదరణ పట్ల తానెంతో ఆకర్షితుడయ్యానని స్టీవ్ వా ఆ డాక్యుమెంటరీలో వెల్లడించాడు. "1986లో తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు.. క్రికెట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం నన్నెంతో ఆకర్షించింది" అని అన్నాడు.
క్రికెట్‌కు భారత్‌లో లభిస్తున్న ప్రాధాన్యంతో పాటు స్టీవ్ వాకు ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీంతో పాటు టీమ్ఇండియాతో ఆడిన అనుభవాలతో సహా దేశంలో పలు సందర్శన ప్రదేశాల గురించి ఇందులో స్టీవ్ వా ప్రస్తావించాడు.
ఇదీ చూడండి: కోహ్లీ నెట్ ప్రాక్టీస్.. కోచ్‌తో రోహిత్ చర్చ