టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా గుర్తింపు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించడం ద్వారా ఈ రికార్డు నమోదు చేశాడు విరాట్.
ఈ మ్యాచ్‌తో 50 టెస్టులకు సారథ్యం వహించిగా ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఇందులో 30 విజయాలున్నాయి. ఫలితంగా తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు విరాట్. ఆసీస్ దిగ్గజాలు స్టీవ్ వా(37), రికీ పాంటింగ్(35)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
అయితే మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు సాధించిన ఏకైక భారత కెప్టెన్ కోహ్లీనే కావడం విశేషం. ఇక భారత్ తరఫున కోహ్లీ కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోనీ 27 విజయాల్ని సాధించాడు. ధోనీ ఓవరాల్‌గా 60 టెస్టులకు కెప్టెన్‌గా చేశాడు.
ఇవీ చూడండి.. టీమిండియా రికార్డు సిరీస్ విజయం