ETV Bharat / sports

స్లెడ్జింగ్​పై కోహ్లీ -పైన్​ ఏమన్నారంటే - పైన్​ స్లెడ్జింగ్​

డిసెంబరు 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​లో స్లెడ్జింగ్​ జోలికి పోనని అన్నాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. అది అర్థరహితమని చెప్పాడు. కాగా, ఆట పరిస్థితులు డిమాండ్​ చేస్తే మాత్రం స్లెడ్జింగ్​ విషయంలో తగ్గేదే లేదని చెప్పాడు ఆస్ట్రేలియా సారథి టిమ్​ పైన్​.

sledging
స్లెడ్జింగ్
author img

By

Published : Dec 16, 2020, 9:48 PM IST

కరోనా ఎంతో మందికి గుణపాఠాలు నేర్పిందని అన్నాడు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ. అలాగే స్లెడ్జింగ్‌ చేయడంలో అర్థం లేదని తాను గ్రహించినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో అనవసర విషయాల వడపోత జరుగుతుందని అన్నాడు. కాగా, ఆట పరిస్థితులు డిమాండ్‌ చేస్తే మాత్రం కవ్వింపులకు వెనకాడబోమని ఆసీస్‌ సారథి టిమ్‌పైన్‌ చెప్పాడు.

'గతంలో ఎంతో అవసరం అనుకున్నవి అంతగా ముఖ్యమైనవి కావని మహమ్మారి వల్ల ప్రజలు ఈ ఏడాది గ్రహించారు. జట్లు, ఆటగాళ్ల మధ్య కోపతాపాలు, పట్టింపులు, ఉద్రికత్తలు నిజంగా అర్థంలేనివి' అని విరాట్‌ అన్నాడు. అయితే ప్రతిసారీ దూకుడుతో పనిలేదని అవసరమైతే మాత్రం తమ ఆటగాళ్లు వెనకడుగు వేయరని పైన్‌ బదులిచ్చాడు. "ఆట పరంగా మైదానంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆటగాళ్లకు ఎదురెళ్లడం, అతి దూకుడును ప్రదర్శించడం వంటివి ముందుగానే ప్లాన్‌ చేయరు. మొదట మా నైపుణ్యంతో బంతి, బ్యాటుతో ప్రణాళికలు అమలు చేస్తాం. అయితే మైదానంలో కొన్నిసార్లు పరిస్థితులు వేడెక్కుతాయి. అలాంటప్పుడు మాత్రం మేం వెనకడుగు వేయం" అని పైన్‌ అన్నాడు.

ఒకవేళ మైదానంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని కోహ్లీ అన్నాడు. "ఆటలో ఎప్పుడైనా హుందాగానే ప్రవర్తించాలి. అవసరమైతే మైదానంలో దేహభాష సైతం సానుకూలంగా, దూకుడుగా ఉండేలా చూసుకోవాలి. గతంలో జరిగినవన్నీ వ్యక్తిగతంగా తీసుకుంటారని అనుకోను. ఎందుకంటే ఆటలో నాణ్యత, పోటీని నిలబెట్టేందుకే అలా చేస్తాం. ఏదేమైనా ఆఖరికి అనవసర విషయాలను వడపోయాలి" అని విరాట్​ చెప్పాడు.

ఇదీ చూడండి : భారత్ x ఆస్ట్రేలియా: 'గులాబి' ఏం మాయ చేస్తుందో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.