టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబయిలో వెస్టిండీస్‌తో మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, ఈ ఫార్మాట్లో స్వదేశంలో 1000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారిలో మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు న్యూజిలాండ్ క్రికెటర్లు మార్టిన్ గప్తిల్(1430), కొలిన్ మన్రో(1000) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ప్రస్తుతం భారీ స్కోరు దిశగా సాగుతోంది భారత్.
ఇది చదవండి: అభిమానులూ... పంత్‌పై కాస్త దయ చూపండి: కోహ్లీ