త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. రాయుడు ఎంపిక కాని నేపథ్యంలో టీమిండియా తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేది ఎవరా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. స్ట్రోక్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్‌ను ఆ స్థానంలో ఆడించాలని టీమిండియా మాజీ సారథి వెంగ్‌సర్కార్ సూచించారు. మెగాటోర్నీలో భారత జట్టు సునాయాసంగా సెమీస్ చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
‘ధావన్, రోహిత్ రూపంలో స్థిరమైన ఓపెనింగ్ జోడీ ఉంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు. అందుకే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ సరైన ఎంపిక. తన టెక్నిక్‌తో టాప్ ఆర్డర్‌కు సహకారం అందించగలడు’ -వెంగ్‌సర్కార్, టీమిండియా మాజీ సారథి
1979, 1983, 1897 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన దిలీప్ వెంగ్‌సర్కార్.. ఇంగ్లాండ్‌లోనే రెండు ప్రపంచకప్‌లు ఆడారు.
‘టీమిండియా త్వరగా టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకుంటే స్పెషలిస్టు ఓపెనర్ అయిన రాహుల్ జట్టుకు నిలకడ ఇవ్వగలడు. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే. భారత్ గతేడాది ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో ఆడడం సానుకూల అంశం. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్ చేరుకుంటాయి. మరో జట్టు ఏదో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే’ -వెంగ్‌సర్కార్, టీమిండియా మాజీ సారథి