ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​: రాహుల్ నం.2- కోహ్లీ@7

author img

By

Published : Feb 15, 2021, 3:55 PM IST

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​. సారథి కోహ్లీ ఏడో స్థానంలో ఉన్నాడు.

rahul kohli
రాహల్​, కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) సోమవారం పురుషుల టీ20 ర్యాంకింగ్స్​ జాబితా విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో తొలి పది స్థానాల్లో ఇద్దరు టీమ్​ఇండియా క్రికెటర్స్​ స్థానం సంపాదించుకున్నారు. కేఎల్​ రాహుల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 816 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకగా.. 697 పాయింట్లతో సారథి కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు. 915 పాయింట్లతో ఇంగ్లాండ్​ క్రికెటర్​ డేవిడ్​ మలాన్​ తొలి స్థానాన్ని కాపాడుకోగా.. మూడో స్థానంలో అరోన్​ఫించ్​(ఆసీస్​) ఉన్నాడు.

team india
బ్యాటింగ్​ విభాగం

బౌలింగ్​ విభాగంలో 736 పాయింట్లతో అఫ్ఘానిస్థాన్​ ఆటగాడు రషీద్​ ఖాన్​ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. దక్షిణాఫ్రికా క్రికెటర్​ తబ్రాజ్ షమ్సీ పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానంలో(733)నిలిచాడు. ఓ స్థానంలో కోల్పోయి మూడో స్థానంలో ముజీబ్​ రహ్మాన్​(అఫ్ఘానిస్థాన్​) ఉన్నాడు.

team india
బౌలింగ్​ విభాగం

ఇక ఆల్​రౌండర్​ విభాగంలో అంతకుముందులానే అఫ్ఘానిస్థాన్​ క్రికెటర్​ మహ్మద్​ నబీ(294) తొలిస్థానంలో నిలవగా.. షకీబ్​ అల్​ హాసన్(బంగ్లా), గ్లెన్​ మ్యాక్స్​వెల్​(ఆసీస్​) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ​

team india
ఆల్​రౌండర్​ విభాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.