ETV Bharat / sports

'అతడితో బ్యాటింగ్ హైలెట్స్ చూస్తున్నట్లే ఉంటుంది' - subman about sachin pointing

ఐపీఎల్​లో సహచర క్రికెటర్ రసెల్ గురించి ఆసక్తికర విషయం చెప్పాడు యువ బ్యాట్స్​మన్ శుభ్​మన్ గిల్. అతడు బ్యాటింగ్ చేస్తుంటే, దాదాపు నాన్ స్ట్రైకింగ్ ఎండ్​లోనే ఉండిపోవాల్సి వస్తుందని అన్నాడు.

'అతడితో బ్యాటింగ్ హైలెట్స్ చూస్తున్నట్లే ఉంటుంది'
యువ బ్యాట్స్​మన్ శుభ్​మన్ గిల్
author img

By

Published : Apr 29, 2020, 10:02 AM IST

వెస్టిండీస్ ఆల్​రౌండర్ ఆండ్రూ రసెల్​ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అతడు మైదానంలో దిగితే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. తన విధ్వంసకర బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అయితే అతడితో కలిసి ఐపీఎల్​లో బ్యాటింగ్ చేయడం ఎలా ఉంది? అన్న ఓ నెటిజన్​ ప్రశ్నకు, భారత యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ క్రేజీ సమాధానమిచ్చాడు. దీనితో పాటే #ఆస్క్​శుభ్​మన్ పేరుతో ట్విట్టర్​లో పలువురి సందేహాలను తీర్చాడు.

Shubman Gill about Russell batting
రసెల్ గురించి చెప్పిన యువ బ్యాట్స్​మన్ శుభ్​మన్ గిల్

రసెల్​తో కలిసి ఆడుతుంటే మ్యాచ్​ హైలెట్స్ చూసిన అనుభూతి కలుగుతుందని, అతడు క్రీజులో ఉంటే, తను దాదాపు నాన్ స్ట్రైకింగ్ ఎండ్​కే పరిమితం కావాల్సి వస్తుందని గిల్ చెప్పాడు.

subman about sachin pointing
సచిన్, పాంటింగ్​ల గురించి చెప్పిన శుభ్​మన్

రిటైర్​ అయిన ఆటగాళ్లలో ఎవరితో ఆడేందుకు ఇష్టపడతావని శుభ్​మన్​ను ప్రశ్నించగా, తడుముకోకుండా దిగ్గజ సచిన్ తెందుల్కర్ పేరు చెప్పాడు. విదేశీ క్రికెటర్లతో అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్​ అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నాడు. అలానే తమ ఫ్రాంఛైజీ యజమాని షారుక్.. తమకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారని గిల్ అన్నాడు. 2018 నుంచి ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడుతున్న ఇతడు.. 132 స్ట్రైక్​రేట్​తో 499 పరుగులు చేశాడు. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.