ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆటగాళ్ల ఎంపికను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా క్రికెటర్లను తీసుకున్నారని అన్నాడు. టాప్ బ్యాట్స్‌మెన్ గాయాలపాలైతే కష్టమని తెలిపాడు.
"కోల్‌కతా జట్టును ఒకసారి పరిశీలిస్తే.. టీమ్‌లో బ్యాకప్ ఆటగాళ్లు లేరు. ఆండ్రు ఆసెల్, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ లాంటి వారికి ప్రత్యామ్నాయం కొరవడింది. మోర్గాన్‌కు గాయమైతే మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్‌మనే లేడు" - గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్
ప్యాట్కమిన్స్ను రూ.15.50 కోట్లకు కోల్‌కతా కొనడం పట్ల గంభీర్ సానుకూలంగా స్పందించాడు.
"కొత్త బంతితో బాగా స్వింగ్ చేయగల బౌలర్ కమిన్స్. మంచి పేస్‌తో వికెట్ల తీయగల సమర్థుడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడిని బాగా ఉపయోగించుకోవచ్చు. నాకు అన్ని మ్యాచ్‌ల్లో కమిన్స్ ఆడతాడనుకుంటున్నారు. 3, 4 మ్యాచ్‌లను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగలడు. అందుకే అతడి కోసం అంత భారీ మొత్తం వెచ్చించాల్సి వచ్చింది" -గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్
మిచెల్ మార్ష్, స్టాయినీస్ను కోల్‌కతా వదులుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. వాళ్లుంటే జట్టు మరింత బలంగా తయారయ్యేదేనని అన్నాడు. కమిన్స్ గాయపడితే ఫెర్గ్యూసన్ రూపంలో ప్రత్యామ్నాం ఉందని, టాపార్డర్‌కు అలాంటి బ్యాకప్ లేదని తెలిపాడు.
ఇదీ చదవండి: శాంటాక్లాజ్‌గా మారిన విరాట్.. చిన్నారులకు సర్ప్రైజ్