ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ 348 ఆలౌట్​.. ఇషాంత్​కు ఐదు వికెట్లు - india tour of nz

వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్​లో 348 పరుగులకు న్యూజిలాండ్​ ఆలౌటైంది. 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

kiwis-allout-for-348
తొలి ఇన్నింగ్స్​లో కివీస్​ 348 ఆలౌట్​... ఇశాంత్​కు ఐదు వికెట్లు
author img

By

Published : Feb 23, 2020, 6:49 AM IST

Updated : Mar 2, 2020, 6:21 AM IST

వెల్లింగ్టన్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో ఆతిథ్య న్యూజిలాండ్​ 348 పరుగులకు ఆలౌటైంది. భారత్​పై 183 పరుగుల అధిక్యంలో ఉంది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు.

ఓవర్​నైట్ స్కోరు 216/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్.. ఆరు, ఏడో వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఎనిమిదో వికెట్​కు గ్రాండ్​హోమ్​తో కలిసి జేమిసన్​ 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం 44 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికే గ్రాండ్​హోమ్​(43) కూడా వెనుదిరిగాడు. చివర్లో బౌల్ట్​​ వేగంగా ఆడి 24 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు.

Last Updated : Mar 2, 2020, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.