ETV Bharat / sports

'సచిన్​ చివరి టెస్టులో కన్నీళ్లు ఆగలేదు' - cricket news latest

సచిన్​ తెందుల్కర్​ వీడ్కోలు టెస్టులో తాను, క్రిస్​ గేల్​ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ కిర్క్​ ఎడ్వర్డ్స్​ తెలిపాడు. సచిన్​ లాంటి దిగ్గజ ఆటగాడిని మళ్లీ మైదానంలో చూడలేమనే ఆలోచన బాధను కలిగించిందని వెల్లడించాడు.

Kirk Edwards said he and Chris Gayle got tears during Sachin Tendulkar's farewell test.
'సచిన్​ చివరి టెస్టులో కన్నీళ్లు ఆగలేదు'
author img

By

Published : Jun 21, 2020, 8:54 AM IST

సచిన్​ తెందుల్కర్​ వీడ్కోలు టెస్టులో క్రిస్​ గేల్​, తాను ఏడవద్దని అనుకున్నామని.. కానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయామని వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ కిర్క్ ఎడ్వర్డ్స్​ అన్నాడు.

2013లో విండీస్​తో జరిగిన సిరీస్​లో రెండో టెస్టుతో సచిన్​ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించారు. ఆ మ్యాచ్ సచిన్​ 200వ టెస్టు కావడం విశేషం. తుది జట్టులో లేకపోయినప్పటికీ ఆ మ్యాచ్​ తనకు భావోద్వేగాలను మిగిల్చిందని ఎడ్వర్డ్స్​ అన్నాడు.

"సచిన్​ 200వ టెస్టు మ్యాచ్​కు నేను అక్కడే ఉన్నా. ఆ మ్యాచ్​ నాకెంతో భావోద్వేగాన్ని కలిగించింది. గేల్​ పక్కనే నేను ఉన్నా. సచిన్​ ఔటై పెవిలియన్​ చేరుతుంటే ఎడవద్దు అనుకున్నాం. కానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాం. అలాంటి దిగ్గజ ఆటగాడిని మళ్లీ మైదానంలో చూడలేమనే ఆలోచనే బాధను కలిగించింది" అని ఎడ్వర్డ్స్​ తెలిపాడు.

ఇదీ చూడండి:'ఆ విషయంలో తొందపాటు పనికిరాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.