టీమిండియాతో సుదీర్ఘ సిరీస్‌కు సిద్ధమవుతోన్న విండీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ దేశ ఆల్‌రౌండర్ చీలమండల గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మిగ్వెల్ కమిన్స్ రానున్నాడు. ఈ విషయాన్ని విండీస్ కోచ్ అధికారికంగా ప్రకటించాడు.
"గాయం కారణంగా కీమో పాల్ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చాం. మిగ్వెల్ జట్టులోకి రానున్నాడు. అతడి అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం".
- ప్లయడ్ రీఫర్, విండీస్ కోచ్
ఆరంభంలోనే సంచలనం...
మూడేళ్ల క్రితం భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరగేట్రం చేశాడు మిగ్వెల్. అతడు బరిలోకి దిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 48 పరుగులే ఇచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య నేటి నుంచి మొదటి టెస్టు జరగనుంది. సాయంత్రం ఏడు గంటల నుంచి ఆట ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో గెలిచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి ఇరుజట్లు.
ఇది చదవండి: రోహిత్‌ను ఆ స్థానంలోనే ఆడించాలి: సెహ్వాగ్