ETV Bharat / sports

తన ఆరోగ్యం గురించి మాట్లాడిన కపిల్​దేవ్​ - కపిల్​ దేవ్​ దీపావళి శుభాకాంక్షలు

అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన మాజీ కెప్టెన్ కపిల్​దేవ్.. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన గుండె బాగా పనిచేస్తోందని వెల్లడించారు.

Kapil dev
కపిల్​దేవ్
author img

By

Published : Nov 13, 2020, 1:33 PM IST

దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​.. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు. 'ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. నా గుండె బాగా పనిచేస్తోంది' అని అన్నారు.

గుండెపోటు కారణంగా ఇటీవలే యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకున్న కపిల్.. ‌కొద్దిరోజుల క్రితమే కోలుకున్నారు. దిల్లీ క్లబ్‌లోని మైదానంలో గురువారం కాసేపు గోల్ఫ్​ ప్రాక్టీస్‌ చేశారు. ఆ వీడియోను పోస్ట్ చేశారు.

తొలి బౌలర్​గా

టీమ్​ఇండియాకు 16 ఏళ్లపాటు ఆల్​రౌండర్​గా సేవలందించిన కపిల్ దేవ్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. కెరీర్​లో 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు చేయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచారు. 1983లో భారత్​కు తొలి ప్రపంచకప్​ను అందించారు.

కపిల్ బయోపిక్ '83'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఇదీ చూడండి : సర్జరీ తర్వాత అభిమానుల ముందుకు కపిల్ దేవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.