ETV Bharat / sports

కపిల్​ దేవ్​, భార్య రోమికి ఎలా ప్రపోజ్​ చేశారంటే? - Kapil Dev reveals how he convinced romi family for marriage

ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న భారత దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​.. 'నో ఫిల్టర్​ నేహా' చాట్​ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భార్య రోమికి అప్పట్లో తన ప్రేమను ఎలా తెలియజేశానో వివరించారు.

Kapil Dev
కపిల్​ దేవ్
author img

By

Published : Nov 19, 2020, 5:47 PM IST

Updated : Nov 19, 2020, 7:47 PM IST

తన కెప్టెన్సీలో దేశానికి తొలి ప్రపంచకప్​ అందించిన టీమ్​ఇండియా మాజీ సారథి కపిల్​ దేవ్​... మైదానంలో ఎన్నో అద్భుతాలు చేసి అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల 'నో ఫిల్టర్​ నేహా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తన భార్య రోమికి ఎలా ప్రపోజ్​ చేశారో వెల్లడించారు.

"నేను నటించిన ఓ యాడ్​ హోర్డింగ్ పక్క నుంచి మేమిద్దం కలిసి ఓ సారి కారులో వెళ్తున్నాం. ఆ ప్రకటనలో వెన్న కారుతున్న నా పళ్లు బయటకు కనిపిస్తున్నాయి. అయితే మళ్లీ అదే ఫోజులో నన్ను ఓ ఫొటో తీయమని రోమిని అడిగాను. ఎందుకని ఆమె తిరిగి ప్రశ్నించింది. ఈ ఫొటోను భవిష్యత్తులో మన పిల్లలకు చూపించాలిగా అని పరోక్షంగా ప్రపోజ్​ చేశాను. అది ఆమెకు అర్థమైంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అని తిరిగి అడగ్గా అవునని చెప్పాను. అలా మేం ప్రేమలో పడ్డాం. ఆ తర్వాత రోమీ వాళ్ల తాతగారిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. ఆయన నాపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఆమె తండ్రి మాత్రం త్వరగానే ఒప్పుకున్నారు. అనంతరం 1980లో మా పెళ్లి జరిగింది"

-కపిల్​ దేవ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

కొన్ని రోజుల క్రితం గండెపోటుకు గురైన కపిల్​దేవ్​.. యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఇటీవల ట్విట్టర్​​ ద్వారా స్వయంగా తెలిపారు.

తొలి బౌలర్​గా

టీమ్​ఇండియాకు 16 ఏళ్లపాటు ఆల్​రౌండర్​గా సేవలందించిన కపిల్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. కెరీర్​లో 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు చేయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచారు. 1983లో భారత్​కు వన్డేల్లో తొలి ప్రపంచకప్​ను అందించిన కెప్టెన్​గా చరిత్రలోకి ఎక్కారు.

కపిల్ బయోపిక్ '83'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

Kapil Dev
కపిల్​ దేవ్ బయోపిక్​లో రణ్​వీర్​, దీపికా

ఇదీ చూడండి : తన ఆరోగ్యం గురించి మాట్లాడిన కపిల్​దేవ్​

Last Updated : Nov 19, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.