టీమ్‌ఇండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ గుండెపోటుకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వెల్లడించారు. ఆస్పత్రిలో కపిల్.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
అంతకుముందు కపిల్ కూడా తన ట్విట్టర్లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానన్నారు.