ETV Bharat / sports

దక్షిణాఫ్రికా పేసర్ రబాడా మరో రికార్డు

పాకిస్థాన్​తో జరుగుతోన్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్​ కగిసొ రబాడా రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్​లో తమ జట్టు తరఫున 200 వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్​గా నిలిచాడు.

author img

By

Published : Jan 28, 2021, 1:39 PM IST

Updated : Jan 28, 2021, 2:08 PM IST

rabada
రబాడా

దక్షిణాఫ్రికా క్రికెటర్​ కగిసొ రబాడా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్​లో తమ జట్టు తరఫున 200 వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్​గా నిలిచాడు. పాకిస్థాన్​తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఫీట్​ను అందుకున్నాడు. 44 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న మూడో వేగవంతమైన బౌలర్​గానూ ఘనత సాధించాడు.

వన్డేల్లో 75 మ్యాచుల్లో 117, టీ20ల్లో 26 మ్యాచులు ఆడి 31 వికెట్లు తీశాడు రబాడా.

దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్టుల్లో డేల్​ స్టెయిన్​ 439 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షాన్​ పొలాక్​ (421), ఎన్తిని(390), అలెన్​ డొనాల్డ్​(330), మోర్నీ మోర్కెల్​(309), జాక్వెస్​ కలిస్​​(291), ​ ఫిలాండర్​(224) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా టెస్టులో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక లెజెండ్​ ముత్తయ్య మురళీధరన్​(800) తొలి స్థానంలో ఉండగా.. షేన్​ వార్న్​(708), అనిల్​ కుంబ్లే(619), జేమ్స్​ అండర్సన్​(606) గ్లెన్​ మెక్​గ్రాత్​(563) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చూడండి: 'ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలర్లలో రబాడా ఒకడు'

Last Updated : Jan 28, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.