ఆస్ట్రేలియాతో మంగళవారం జరగబోయే చివరి టీ20కి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ అందుబాటులో ఉండట్లేదు. కుటుంబంతో గడపడానికి బట్లర్ బయో బబుల్ విడిచి ఇంటికి పయనమయ్యాడు. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది ఇంగ్లీష్ జట్టు.
ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో 77 పరుగులతో జట్టుకు విజయాన్నందించాడు బట్లర్. ఇంగ్లీష్ జట్టు సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా బట్లర్ బయో బబుల్‌కు వచ్చి రెండు నెలలు అవుతోంది. అప్పటి నుంచి అతడు కుటుంబానికి దూరంగానే ఉన్నాడు. వరుసగా వెస్టిండీస్, పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు, టీ20లు ఆడాడు.
ఆసీస్‌తో శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో బట్లర్ బయో బబుల్‌లోకి వచ్చేముందు మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.