ETV Bharat / sports

'రోహిత్ భారీ షాట్లు అలవోకగా ఆడతాడు' - buttler lauds indian opener rohit sharma butler praising rohit sharma

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. అతడు భారీ షాట్లు ఆడుతుంటే ముచ్చటేస్తుందని అన్నాడు.

రోహిత్
రోహిత్
author img

By

Published : Apr 16, 2020, 10:39 AM IST

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ తననెప్పుడూ అబ్బురపరుస్తూ ఉంటుందని ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జాస్‌ బట్లర్‌ అన్నాడు. తన ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బట్లర్‌ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.

"రోహిత్‌ అద్భుతమైన ఆటగాడు. అలవోకగా షాట్లు ఆడతాడు. కొందరు భారత ఆటగాళ్లకు ఇలాంటి సామర్థ్యమే ఉంది. రోహిత్‌ చాలా కాలంగా గొప్ప ప్రదర్శన చేస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ శైలి, అలవోకగా షాట్లు ఆడే తీరు నాకెంతో నచ్చుతాయి. ఒకసారి కుదరుకున్నాడంటే రోహిత్‌ భారీ స్కోర్లు సాధించి మ్యాచ్‌ ఫలితాల్ని మార్చేస్తాడు. కొన్నేళ్ల కిందటి వరకు భారత బ్యాట్స్‌మెన్‌ను ప్రత్యర్థి జట్ల బౌలర్లు షార్ట్‌ బంతులతో ఇబ్బంది పెట్టేవాళ్లు. అయితే రోహిత్‌ ఆ బంతులకు భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు" అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.