ఐపీఎల్ 12వ సీజన్ సందడి సందడిగా సాగుతోంది. జట్లన్నీ ఒకటి, రెండు రోజుల వ్యవధిలో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఎక్కువగా విమాన ప్రయాణాల్లోనే గడిపేస్తున్నారు జట్టు సభ్యులు. ఈ సమయంలో కొందరు క్రికెటర్స్ సరదాగా సహచరుల్ని ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది సన్‌రైజర్స్.
ఈ సీజన్లో సన్‌రైజర్స్ తరఫున బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు బెయిర్‌స్టో. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో సహ క్రికెటర్ విలియమ్సన్తో పాటు విమాన సిబ్బందిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓడిపోయింది హైదరాబాద్. ఈరోజు పంజాబ్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఫాంలోకి రావాలని హైదరాబాదీ జట్టు భావిస్తోంది.
ఇవీ చదవండి: