కరోనా కారణంగా అనేక దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్. దీని నుంచి గట్టేక్కించడానికి అక్టోబరు నుంచి జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఖాళీ స్టేడియాల్లో ఆడటానికి క్రికెటర్లు సిద్ధంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా లాక్డౌన్ ముందు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ప్రేక్షకులు లేకుండా ఆడిన అనుభవం నీషమ్‌కు ఉంది.
"ఖాళీ స్టేడియాల్లో టోర్నమెంట్లు ఆడాలంటే క్రికెటర్లు అందుకు అంగీకరించాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీని కోసం ప్రతి ఒక్కరూ ఆడాలి. దీని వల్ల ఏ ఆటగాడికైనా సమస్యలు ఎదురవుతాయని నేను అనుకోవడం లేదు". -- జిమ్మీ నీషమ్, కివీస్ ఆల్‌రౌండర్
కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ గాల్లో దీపంలా మారింది. టోర్నీ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. అందులో కొన్ని చర్చలతో పాటు టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
ఇదీ చూడండి.. 'సచిన్‌ను ఔటిస్తే నేను హోటల్‌కి వెళ్లే వాడ్ని కాదేమో!'