మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన దిగ్గజ పేసర్ మెక్‌గ్రాత్. అయితే ప్రస్తుతం ఈ జాబితాలో చేరే పేసర్ ఎవరని ఇతడిని అడగ్గా.. ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ పేరు చెప్పాడు. మేటి క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కంటే బ్రియాన్ లారాకు బౌలింగ్ చేయడం కొంచెం కష్టమని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. వీటితోపాటు మరిన్ని విషయాలను ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
డేంజర్ బ్యాట్స్‌మెన్ లారా
కెరీర్లో మీరు ఎదుర్కొన్న కఠినమైన బ్యాట్స్‌మెన్ ఎవరు? అని మెక్‌గ్రాత్‌ను ప్రశ్నించగా.. లారా, సచిన్, రాహుల్ ద్రవిడ్ పేర్లను వెల్లడించాడు. వీరిలో బ్రియాన్ లారా కఠినమైన బ్యాట్స్‌మన్ అని అన్నాడు.
కెరీర్లో ఎలాంటి బంతిని మీరు వేయాలనుకున్నారని ఇతడిని అడగ్గా.. గంటకు 100 మైళ్ల వేగాన్ని అందుకోవాలనుకున్నా, కుదరలేదని చెప్పాడు. 'డంబ్ అండ్ డంబర్' చిత్రంలో జిమ్ కారీ నటన చూసిన తర్వాత.. తన బయోపిక్ తీస్తే అందులో అతడే నటించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి.. అదొక్కటే ఎందుకు గుర్తుంచుకుంటారు: అక్తర్