ETV Bharat / sports

బాలీవుడ్​ పాటకు జెమీమాతో ఆసీస్ చిన్నారుల డ్యాన్స్ - Haan Main Galat song dance

టీమిండియా క్రికెటర్​ జెమీమా.. టీ20 ప్రపంచకప్​లో ఆడుతూనే డ్యాన్స్ గురువుగానూ మారింది. ఆస్ట్రేలియా చిన్నారులకు నృత్యంలో మెలకువలు నేర్పించింది. ఆ వీడియోను ఐసీసీ పోస్ట్​ చేసింది.

బాలీవుడ్​ పాటకు జెమీమాతో ఆసీస్ చిన్నారుల డ్యాన్స్
క్రికెటర్ జెమీమా రోడ్రిగ్జ్
author img

By

Published : Feb 29, 2020, 8:09 PM IST

Updated : Mar 2, 2020, 11:58 PM IST

టీ20 ప్రపంచకప్​లో వరుస విజయాలు నమోదు చేస్తూ ఫుల్​జోష్​లో ఉంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ ఆనందాన్ని సభ్యులు అందరూ అస్వాదిస్తుండగా, జెమీమా రోడ్రిగ్జ్ మాత్రం డ్యాన్స్​తో అలరిస్తుంది. ఇటీవలే సెక్యూరిటీ గార్డ్​తో కలిసి చిందేసిన ఈ క్రికెటర్.. ఇప్పుడు బాలీవుడ్​ పాటకు ఆస్ట్రేలియా చిన్నారులతో కలిసి నృత్యం చేసింది. ఈ వీడియోను ఐసీసీ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ఇందులో సహచర ప్లేయర్ హర్లీన్ దేఓల్​తో కలిసి చిన్నారులకు డ్యాన్స్ నేర్పింది జెమీమా. 'లవ్ ఆజ్ కల్ 2' సినిమాలోని 'హో మై గలత్' పాటకు కాలు కదిపింది.

19 ఏళ్ల జెమీమా.. 2018లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 16 వన్డేలు, 43 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. పొట్టి ఫార్మాట్​లో ఆరు, వన్డేల్లో మూడు అర్ధ సెంచరీలు చేసింది.

ఇది చదవండి: సెక్యూరిటీ గార్డ్​తో భారత మహిళా క్రికెటర్ డ్యాన్స్

Last Updated : Mar 2, 2020, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.