జయదేవ్ ఉనద్కత్‌కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్టుంది. ఇటీవలె ఇతడి సారథ్యంలోని సౌరాష్ట్ర జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవగా.. తాజాగా ఈ పేసర్ పెళ్లికొడుకయ్యాడు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రిన్నీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. తాజాగా అక్కడ తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు జయదేవ్. ఈ క్రికెటర్‌కు పలువురు ఆటగాళ్లు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు స్టార్ క్రికెట్ చెతేశ్వర్ పుజారా హాజరయ్యాడు.
-
6 hours, 2 meals & 1 shared mud cake later.. 💍❤️ pic.twitter.com/SEvHFDQwru
— Jaydev Unadkat (@JUnadkat) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">6 hours, 2 meals & 1 shared mud cake later.. 💍❤️ pic.twitter.com/SEvHFDQwru
— Jaydev Unadkat (@JUnadkat) March 15, 20206 hours, 2 meals & 1 shared mud cake later.. 💍❤️ pic.twitter.com/SEvHFDQwru
— Jaydev Unadkat (@JUnadkat) March 15, 2020
-
Welcome to the family Rinny. I am so glad that my brother @JUnadkat has found the love of his life. 🤗
— cheteshwar pujara (@cheteshwar1) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
P:S - You have to deal with a lot of bromance pic.twitter.com/X9aZxFfm0o
">Welcome to the family Rinny. I am so glad that my brother @JUnadkat has found the love of his life. 🤗
— cheteshwar pujara (@cheteshwar1) March 15, 2020
P:S - You have to deal with a lot of bromance pic.twitter.com/X9aZxFfm0oWelcome to the family Rinny. I am so glad that my brother @JUnadkat has found the love of his life. 🤗
— cheteshwar pujara (@cheteshwar1) March 15, 2020
P:S - You have to deal with a lot of bromance pic.twitter.com/X9aZxFfm0o
తాజాగా జరిగిన రంజీ టోర్నీలో ఈ 21 ఏళ్ల జయదేవ్.. ఒక సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. మెగాటోర్నీలో 13.23 సగటుతో 67 వికెట్లు తీశాడు. సౌరాష్ట్ర జట్టు మూడు సార్లు ఫైనల్ చేరగా.. ఈ ఏడాది తొలి టైటిల్ గెలిచింది. తుది పోరులో బెంగాల్ జట్టుపై విజయం సాధించింది.
జయదేవ్ చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ప్రస్తుతం భారత జట్టులో పునరాగమనం కోసం ఇతడు ఎదురుచూస్తున్నాడు.