అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా, బోర్డు కార్యదర్శి జై షా వ్యవహరించనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) దీనిని తీర్మానించారు. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
అంతకముందు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఐసీసీ బోర్డులో భారత ప్రతినిధిగా వ్యవహరించేవాడు. ఇటీవల గుండెపోటుకు గురై, చికిత్స తీసుకున్న దాదా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందువల్లే ఐసీసీ బోర్డు సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిగా జైషా ఉండనున్నారు.
2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ నిర్వహణపై విధించే పన్నులో రాయితీ విషయమై కేంద్రంతో త్వరలోనే చర్చించబోతున్నట్లు సదరు బీసీసీఐ అధికారి వెల్లడించారు.
ఇదీ చూడండి : గంగూలీ డిశ్చార్జ్ గురించి అప్డేట్