పాకిస్థాన్ మహిళా క్రికెటర్ జవేరియా ఖాన్.. ఆ దేశం తరఫున వంద టీ20లు ఆడిన నాలుగో మహిళగా ఘనత సాధించింది. సనా మిర్, బిస్మహ్ మరూఫ్, నిదా దర్.. ఈమె కంటే ముందున్నారు.
టీ20 మహిళా ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో జవేరియా, ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఈ పోరులో బిస్మహ్ మరూఫ్ గైర్హాజరీతో కెప్టెన్‌గా వ్యవహరించింది జవేరియా. 34 బంతుల్లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. జట్టును మాత్రం గెలిపించలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవరల్లో 136 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్థాన్ 119 పరుగులు చేసి, 17 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా సఫారీ మహిళలు సెమీస్ చేరుకున్నారు.