ETV Bharat / sports

రూమర్లకు చెక్​.. సంజనా గణేశన్​తో బుమ్రా పెళ్లి - బుమ్రా పెళ్లి వార్తలు

భారత స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా పెళ్లిపీటలు ఎక్కాడు. అందరూ ఊహించినట్టుగానే టీవీ ప్రజెంటర్​ సంజనా గణేశన్​ను బుమ్రా పెళ్లాడాడు. ఈ విషయాన్ని సంజనా గణేశన్​ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది.

Jasprit Bumrah ties knot with Sanjana Ganesan
రూమర్లకు చెక్​.. సంజనా గణేశన్​ను పెళ్లాడిన బుమ్రా
author img

By

Published : Mar 15, 2021, 3:58 PM IST

Updated : Mar 15, 2021, 4:33 PM IST

టీమ్​ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా వివాహంపై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే మోడల్​, టీవీ ప్రజెంటర్​ సంజనా గణేశన్​ను బుమ్రా పెళ్లాడాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు వీరిద్దరి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Jasprit Bumrah ties knot with Sanjana Ganesan
పెళ్లిపందిరిలో సంజనా గణేశన్​, జస్​ప్రీత్​ బుమ్రా

"ప్రేమ.. అది మిమ్మల్ని వెతుక్కొని వస్తే ఎంతో విలువైనది. మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని బుమ్రా సంజనను వివాహమాడిన ఫొటోలను పోస్టు చేశాడు.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో బుమ్రా సెలవులు తీసుకున్నాడు. దీంతో అప్పటి నుంచీ అతడి వివాహ ముచ్చట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. సంజన పేరు తెరపైకి వచ్చినా ఇరువురి నుంచీ ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలోనే బుమ్రా అత్యంత గోప్యంగా ఈ విషయాన్ని దాచిపెట్టి సోమవారం గోవాలో తన ప్రియసఖితో ఏడడుగులు వేశాడు.

ఇదీ చూడండి: ఓ ఇంటి వాడు కాబోతున్న బుమ్రా- గోవాలో పెళ్లి

Last Updated : Mar 15, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.