ETV Bharat / sports

డిన్నర్ బ్రేక్: ఆస్ట్రేలియా 35/2 - Border Gavaskar trophy 2020

టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది.

Jasprit Bumrah double blow leaves Australia at 35/2 at dinner
డిన్నర్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 35/2
author img

By

Published : Dec 18, 2020, 11:47 AM IST

Updated : Dec 18, 2020, 3:06 PM IST

టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆస్ట్రేలియా. రెండో రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. ఇంకా 209 పరుగులు వెనకబడి ఉంది ఆసీస్.

ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (8), జో బర్న్స్‌ (5) చాలా జాగ్రత్తగా ఆడారు. ఐదు ఓవర్లకు పరుగుల ఖాతా తెరిచారు. ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ వేసే కట్టుదిట్టమైన బంతుల్ని ఆచితూచి ఎదుర్కొన్నారు. తర్వాత ఈ ఇద్దరిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు బుమ్రా. వేడ్ (8), బర్న్స్ (8) బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యారు. ప్రస్తుతం లబుషేన్ (16), స్మిత్ (1) క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 244 పరుగులు చేసింది. 233/6 స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన కోహ్లీసేన మరో 11 పరుగులే చేసి ఆలౌటైంది.

Last Updated : Dec 18, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.