ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండ్సన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన వారి జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. 28 సార్లు ఈ ఘనత సాధించి.. రవిచంద్రన్ అశ్విన్(భారత్), ఇయాన్ బోథమ్(ఇంగ్లాండ్) రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరూ టెస్టుల్లో 27 సార్లు ఐదు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 40 పరుగులిచ్చి 5 వికెట్లతో సత్తాచాటాడు అండర్సన్. సఫారీ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డుప్లెసిస్(1), డ్వేన్ ప్రెటోరియస్(4), కేశవ్ మహారాజ్(8), రబాడా(0), ఆన్రిచ్ నోర్ట్జే(4) వికెట్లు తీశాడు.
అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్(133 మ్యాచ్‌ల్లో 67 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు 5 వికెట్లు తీసి 4వ స్థానంలో ఉన్నాడు.
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 223 పరుగులకు ఆలౌట్ చేసింది ఇంగ్లాండ్. తద్వారా 46 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది.
ఇదీ చదవండి: నాలుగు రోజుల టెస్టు నిర్ణయాన్ని తప్పుబట్టిన సచిన్