ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 30 సార్లు 5 వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు అతడు 29సార్లు ఐదు వికెట్లు తీసి.. ఆసీస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌తో 6వ స్థానాన్ని పంచుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అతడు ఈ జాబితాలో మెక్‌గ్రాత్‌ను 7వ స్థానానికి నెట్టాడు.
అత్యధికంగా 5 వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంగ దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ అగ్రస్థానంలో (67సార్లు) ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్(37), సర్ హాడ్లీ(36), అనిల్ కుంబ్లే(35), హెరాత్(34) ఉన్నారు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వాళ్లలో 4వ స్థానంలో ఉన్నాడు అండర్సన్. ఇక పేసర్లలో అయితే 606 వికెట్లతో అతడే నెం.1. మరో 14 వికెట్లు తీస్తే భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను దాటి.. మూడో స్థానానికి చేరుకుంటాడు. పేసర్లలో 5 వికెట్లు తీసిన వారిలో రిచర్డ హాడ్లీ మాత్రమే (36సార్లు) అండర్సన్ కన్నా ముందున్నాడు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌పై 3-0 తేడాతో భారత్‌దే గెలుపు: హాగ్