టీమిండియా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే.. తడుముకోకుండా ఎక్కువ మంది చెప్పే పేరు రవీంద్ర జడేజా. మైదానంలో వేగంగా కదులుతూ అసాధారణ క్యాచ్‌లతో జట్టు విజయంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించాడు. తాజాగా విశాఖలో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన క్యాచ్ అందుకొని మరోసారి ఔరా అనిపించాడు జడ్డూ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
-
That Jadeja caught and bowled is pretty ridiculous. He actually ended up making it look really easy but it's a hell of a grab. pic.twitter.com/G0lJwTHbol
— Doc (@DocBrownCricket) October 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That Jadeja caught and bowled is pretty ridiculous. He actually ended up making it look really easy but it's a hell of a grab. pic.twitter.com/G0lJwTHbol
— Doc (@DocBrownCricket) October 6, 2019That Jadeja caught and bowled is pretty ridiculous. He actually ended up making it look really easy but it's a hell of a grab. pic.twitter.com/G0lJwTHbol
— Doc (@DocBrownCricket) October 6, 2019
ఆదివారం జరిగిన తొలి టెస్టు చివరిరోజు ఆటలో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మర్కరమ్ (39) క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు జడేజా. 26వ ఓవర్ జడ్డూ వేయగా.. తొలి బంతిని బౌలర్‌వైపు ఆడాడు మర్కరమ్. వేగంగా తన వైపునకు వస్తున్న బంతిని హఠాత్తుగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు జడేజా. తన ఔట్‌ను నమ్మలేక ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయాడు ఆ సఫారీ బ్యాట్స్‌మెన్.
ఈ మ్యాచ్‌లో జడ్డూ 6వికెట్లు తీశాడు. మర్కరమ్‌ను ఔట్ చేసిన ఓవర్లోనే నాలుగో బంతికి ఫిలాండర్(0), ఐదో బంతికి కేశవ్ మహరాజ్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇదీ చదవండి: రికార్డు: విశాఖ టెస్టు.. సిక్సర్లలో బెస్టు