ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కోలుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విజయ్ శంకర్. మేనేజ్మెంట్ ఏ బాధ్యతనిచ్చినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటమనేది ఒత్తిడి కాదు బాధ్యత అని పేర్కొన్నాడు.
"పరిస్థితిని బట్టి ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఎంత బలంగా ఆడాననేది కాదు. జట్టుకు ఎలా ఉపయోగపడాననేదే ముఖ్యం. 6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఇక్కడ ఒత్తిడేమీ లేదు... బాధ్యత మాత్రమే ఉంది." -విజయ్ శంకర్, టీమిండియా క్రికెటర్
పాకిస్థాన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన విజయ్ శంకర్.. తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
"పాక్‌పై ప్రదర్శన నాలోని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ముఖ్యంగా ఆ జట్టుపై ప్రపంచకప్‌లో ఆడటం ప్రత్యేక అనుభవం. ఒత్తిడిని జయించి ఆడగలిగాను. చివరగా జట్టు గెలుపే నాకు ముఖ్యం." -విజయ్ శంకర్, టీమిండియా క్రికెటర్
అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు ఓ మీడియా కార్యక్రమంలో తన ఫిట్‌నెస్‌పై స్పష్టతనిచ్చాడు విజయ్ శంకర్. బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇది చదవండి: ఫేవరెట్‌తో పసికూన పోరు.. పోటీ ఎంత!