ఆస్ట్రేలియాపై గెలిచి మరపురాని విజయాన్ని భారత్‌కు అందించాడు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె. ఆ విజయం తమ క్రికెటర్ల జీవితాల్లో అద్భుత క్షణమని చెప్పాడు. బ్రిస్బేన్‌లో చివరి టెస్టు గెలవగానే డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
-
As we draw curtains on our historic triumph and start our preparations for the home series, here’s Captain @ajinkyarahane88‘s address to #TeamIndia from the Gabba dressing room.
— BCCI (@BCCI) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Full 🎥https://t.co/Sh2tkR5c7j pic.twitter.com/l7wr6UXSxq
">As we draw curtains on our historic triumph and start our preparations for the home series, here’s Captain @ajinkyarahane88‘s address to #TeamIndia from the Gabba dressing room.
— BCCI (@BCCI) January 23, 2021
Full 🎥https://t.co/Sh2tkR5c7j pic.twitter.com/l7wr6UXSxqAs we draw curtains on our historic triumph and start our preparations for the home series, here’s Captain @ajinkyarahane88‘s address to #TeamIndia from the Gabba dressing room.
— BCCI (@BCCI) January 23, 2021
Full 🎥https://t.co/Sh2tkR5c7j pic.twitter.com/l7wr6UXSxq
"ఇది మనందరికి చాలా చాలా పెద్ద సందర్భం. అడిలైడ్ తర్వాత మెల్బోర్న్ నుంచి జరిగింది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కరిద్దరి వల్ల సాధ్యపడింది కాదు. జరిగిన మూడు మ్యాచుల్లో ప్రతి ఒక్కరూ కృషిచేశారు. గెలుపుతో సిరీస్‌ను ముగించడం ఎంతో బాగుంది"
-అజింక్య రహానె, భారత తాత్కాలిక కెప్టెన్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆడిన తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది టీమ్ఇండియా. తర్వాత మ్యాచ్‌ల నుంచి సారథి విరాట్ కోహ్లీ లేకున్నా సరే భారత బృందం అనూహ్యంగా పుంజుకుంది. మెల్బోర్న్లో రహానె మెరుపు శతకంతో సిరీస్ సమం చేసింది. సిడ్నీ టెస్టు డ్రా చేయడం సహా గబ్బా విజయంతో సిరీస్ చేజిక్కుంచుకుని సగర్వంగా స్వదేశానికి తిరిగొచ్చింది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: భారత్ వెళ్లే ముందు విరాట్ చెప్పిందదే: సైనీ