ETV Bharat / sports

భారత్​-పాక్ సిరీస్​ అందువల్లే జరగట్లేదు: ఇమ్రాన్​

author img

By

Published : Aug 17, 2020, 6:31 PM IST

భారత ప్రభుత్వ విధానాల వల్లే భారత్-పాక్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరగట్లేదని ఆరోపించారు దాయాది దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు జట్లు తలపడితే మైదానంలో భయంకరమైన వాతావరణ పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

Imran Khan
ఇమ్రాన్​ ఖాన్​

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్నీ పునఃప్రారంభమవుతున్నాయి. ఇందులో క్రికెట్​ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చాలా కాలంగా నిలిచిపోయిన భారత్​-పాక్​ సిరీస్​పై స్పందించారు దాయాది దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. ఇదే అదనుగా చూసి మరోసారి భారత్​పై అక్కసు వెళ్లగక్కారు.

వాస్తవ పరిస్థితులను చక్కదిద్దటం విస్మరించి.. భారత​ ప్రభుత్వ వైఖరి వల్లే ఇరు జట్ల మధ్య సిరీస్​ జరగట్లేదని ఆరోపించారు ఇమ్రాన్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య మ్యాచులు జరిగితే.. మైదానంలో భయంకరమైన వాతవరణం ఏర్పడటానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇటీవల పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​.. పాక్​-భారత్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ను తిరిగి ప్రారంభించాలని అభిప్రాయడ్డాడు. తద్వారా ఈ సిరీస్​ ద్వారా వచ్చిన నగదును కరోనా బాధితులకు వినియోగించాలని చెప్పాడు. అయితే దీనిపై స్పందించిన భారత్​కు చెందిన పలువురు క్రికెటర్లు.. ఇది జరగదని కరాఖండిగా చెప్పారు.

అప్పుడే ఆడింది

చివరిసారిగా భారత్​-పాక్​ మధ్య 2012 డిసెంబరు 25 నుంచి 2013 జనవరి 6 వరకు మూడు వన్డేలు, రెండు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్​ జరిగింది. 2019లో ఐసీసీ ప్రపంచకప్​లో వీరిద్దరు తలపడగా భారత్​ తిరుగులేని విజయాన్ని సాధించింది.

వైఖరి మార్చుకుంటేనే

చాలా కాలంగా భారత్​-పాక్​ సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ వైఖరి మార్చుకోవాలని దాయాది దేశ ప్రభుత్వానికి భారత్​ ఎన్నో సార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య సిరీస్​లు నిలిచిపోయాయి. పాక్​ తన కపట బుద్ధిని మార్చుకుంటేనే యథావిధిగా మ్యాచులు జరుగుతాయని క్రీడా విశ్లేషకుల వాదన.

ఇది చూడండి 'తొలి టెస్టు తర్వాతే ధోనీ రిటైర్మెంట్ షాక్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.