ETV Bharat / sports

ధోనీ అందుకే సక్సెస్ అయ్యాడు: నెహ్రా

మహేంద్ర సింగ్ ధోనీ.. తన కెరీర్​లో తొలి సెంచరీ చేసి నేటికి 15 ఏళ్లు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అయితే మహీ కెరీర్​లో ఆరంభం అంత అద్భుతంగా సాగలేదని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ బౌలర్ నెహ్రా.

నెహ్రా
నెహ్రా
author img

By

Published : Apr 5, 2020, 7:00 PM IST

Updated : Apr 5, 2020, 8:20 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఉత్తమ సారథి, ఫినిషర్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించాడు. అయితే ధోనీకి క్రికెట్‌ కెరీర్‌లో ఆరంభం అద్భుతంగా సాగలేదని భారత మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు విశాఖ వేదికగా పాకిస్థాన్‌పై ధోనీ తన తొలి శతకాన్ని బాదాడు. 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా ధోనీ కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన విషయాల గురించి నెహ్రా మాట్లాడాడు.

"ఆ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియాకు ఉత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దొరికాడని భావించారంతా. అయితే ఆదిలో ధోనీకి శుభారంభం దక్కలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆ ఇన్నింగ్స్‌తో.. జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తనపై తనకి ఉన్న విశ్వాసమే అతడి బలం. ఆ ఇన్నింగ్స్‌తో అతడు పరుగుల దాహంతో ఉన్నాడని తెలిసింది. అయితే ఆ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడినా మాకు ధోనీ దొరికాడు."

-నెహ్రా, టీమ్​ఇండియా మాజీ బౌలర్

"టీమ్‌ఇండియాలోకి వచ్చినప్పుడు ధోనీ కీపర్‌గా అత్యుత్తమం కాదు. అతడి కంటే ముందు కిరణ్‌ మోరే, నయాన్‌ మోంగియా గొప్ప సేవలు అందించారు. కానీ ఆటపై అతడికి ఉన్న క్రమశిక్షణ, ఇష్టం, ప్రశాంతత, విశ్వాసం ధోనీని గొప్పవాడిని చేశాయి. తనకి వచ్చిన అవకాశాలతో దినేశ్‌ కార్తీక్‌, పార్థివ్‌ పటేల్‌ కంటే ఎంతో మెరుగని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అత్యుత్తమ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు" అని నెహ్రా తెలిపాడు.

Last Updated : Apr 5, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.