ETV Bharat / sports

'సచిన్​ నాలోని ఉత్తమ బౌలర్​ను బయటకు తీశాడు'

సచిన్​ వంటి దిగ్గజ క్రికెటర్​కు బౌలింగ్​ చేయడం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియీ మాజీ పేసర్​ బ్రెట్​లీ అన్నాడు. తనలోని ఉత్తమ బౌలర్​ను సచిన్​ బయటకు తీసుకొచ్చినట్లు తెలిపాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు లీ.

brett lee about sachin
బ్రెట్​లీ
author img

By

Published : Aug 1, 2020, 10:27 AM IST

Updated : Aug 1, 2020, 2:39 PM IST

ఆస్ట్రేలియా- టీమ్​ఇండియా మధ్య జరిగే మ్యాచ్​ అంటే అభిమానులకు ఓ పండగనే చెప్పాలి. ముఖ్యంగా క్రికెట్​ మైదానంలో మాజీ ఆసీస్​ పేసర్​ బ్రెట్​లీ, భారత బ్యాటింగ్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్​ మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఆసీస్​ పేస్​ దాడిని, ప్రధానంగా లీ వేసిన బంతిని సచిన్​ బౌండరీ దాటిస్తుంటే అభిమానుల్లో సంతోషం రెట్టింపు అయ్యేది.

తాజాగా సచిన్​ తెందూల్కర్​ వంటి దిగ్గజ బ్యాట్స్​మన్​తో పోటీ పడటాన్ని తను ఎంతగానో ఆస్వాదించినట్లు తెలిపాడు బ్రెట్​ లీ. తనలోని ఉత్తమమైన బౌలర్​ను సచిన్​ బయటకు తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నాడు లీ.

"నా టెస్టు రికార్డుల కంటే వన్డే రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే టెస్టుల కంటే వన్డే క్రికెట్​లో నాకు ఎక్కువ అవకాశం లభించింది. నేను మంచి ఫామ్​లో ఉన్నప్పుడు 160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్​ వేసేవాడిని. 2005, 2006 సంవత్సరాల మధ్య నేను చాలా కోల్పోయా. కానీ వన్డే క్రికెట్​కు నా బౌలింగ్​ మరింత అనుకూలంగా ఉందని భావిస్తున్నా. సచిన్​ తెందూల్కర్​కు బౌలింగ్​ చేసే అవకాశం నిజంగా నన్ను పులకరింపజేసింది. నేను ఉత్తమ బౌలర్​ అని నిరూపించుకోవాలనుకున్నా. ఎందుకంటే, మీరు గొప్ప పోటీ ఇవ్వాలనుకుంటే.. అంతే దృఢంగా ఉండాలి. సచిన్​తో ఆడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అలాగే అనిపించింది. అతను నాలోని ఉత్తమమైన ఆటగాడిని బయటకు తీసుకొచ్చాడు."

-బ్రెట్​లీ, మాజీ ఆస్ట్రేలియా బౌలర్​

ఆస్ట్రేలియాతో జరిగిన 30 వన్డేల్లో తెందూల్కర్​ను 9 సార్లు అవుట్​ చేశాడు బ్రెట్​లీ. ఇప్పటివరకు తన కెరీర్​లో 700 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే "సచిన్​పై నేను మంచి రికార్డునే సాధించా. కానీ, పరుగులు చేయడంలో అతనికి నాపై మంచి రికార్డు ఉందని గుర్తించాలి" అని వివరించాడు లీ.

Last Updated : Aug 1, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.