ETV Bharat / sports

వాటిని అసలు విడిచిపెట్టను: జస్టిన్​ లాంగర్​ - critics justin langer

విమర్శలు తనకు మేలుకొలుపు లాంటివని అన్నాడు ఆస్ట్రేలియా కోచ్​ జస్టిన్​ లాంగర్​. తన తప్పులను సరిచేసుకుంటానని చెప్పాడు. ఇటీవల టీమ్​ఇండియా చేతిలో ఆసీస్​ ఓటమి పాలయ్యాక లాంగర్​పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు​ ఈ విధంగా మాట్లాడాడు.

langer
లాంగర్​
author img

By

Published : Feb 2, 2021, 5:07 PM IST

తనపై వచ్చిన విమర్శల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టబోనని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ఇటీవల ఆ జట్టు టీమ్‌ఇండియా చేతిలో ఘోర పరాభవం పాలయ్యాక కోచ్‌తో ఆసీస్‌ ఆటగాళ్లకు పొసగడం లేదని అక్కడి మీడియాలో కథనం వచ్చింది. లాంగర్‌ కోచింగ్‌ శైలి బాగోలేదంటూ పలువురు సీనియర్‌ ఆటగాళ్లే అసంతృప్తితో ఉన్నారని దాని సారాంశం. తొలుత వాటిని ఖండించిన లాంగర్‌ ఇప్పుడు తన తప్పులను సరిచేసుకుంటానని అన్నాడు.

'ఇప్పుడా విమర్శలను విడిచిపెట్టను. అవి నాకు మేలుకొలుపు లాంటివి. వాటిని గొప్ప బహుమతిగా భావిస్తా. ఎప్పుడైతే కోచింగ్‌ కెరీర్‌ను వదులుకుంటానో అప్పుడు.. నన్ను నేను కొత్త కోచ్‌గానే పరిగణించుకుంటా. నా జీవితంలో మార్గనిర్దేశకులు ఎవరైనా ఉన్నారంటే నా గురించి నిజాలు చెప్పేవాళ్లే. నాకు అలాంటి వాస్తవమైన అభిప్రాయాలే కావాలి. ఆ సమయంలో అవి నాకు నచ్చకపోయినా, అవెంతో ముఖ్యం' అని లాంగర్‌ పేర్కొన్నాడు.

నా గురించి జట్టులో ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలిసింది. నేనేంటో మీకు తెలుసు. చాలా సాధారణంగా ఉంటా. ఈ విమర్శలను సానుకూలంగా తీసుకుంటా. వాటి మీద దృష్టిసారిస్తా. అయితే, కొన్నిసార్లు కఠినంగా ఉంటా. నేను అత్యుత్తమ కోచ్‌ కాకపోయినా కొన్నింటిలో బాగానే పనిచేస్తా. ఈ అంశంపై ఆటగాళ్లు నేరుగా వచ్చి నాతో మాట్లాడొచ్చు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకుందాం' అని ఆసీస్‌ కోచ్‌ వివరించాడు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. లాంగరే కారణం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.