ETV Bharat / sports

టెస్టు సిరీస్​ నుంచి ఇషాంత్​ శర్మ ఔట్​ - వన్డే సిరీస్​కు బ్యాకప్​ బౌలర్​గా నటరాజన్​

ఆస్ట్రేలియాతో టెస్టులు ఆడాల్సిన పేసర్​ ఇషాంత్ శ‌ర్మ..‌ సిరీస్​ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అలానే వన్డేలకు బ్యాకప్​ బౌలర్​గా నటరాజన్​ను ఎంపిక చేసింది బీసీసీఐ.

Ishant Sharma ruled out of Test series, Natarajan added to ODI squad
టెస్టు సిరీస్​ నుంచి ఇషాంత్​ ఔట్​.. బ్యాకప్​ బౌలర్​గా నటరాజన్​
author img

By

Published : Nov 27, 2020, 1:11 PM IST

Updated : Nov 27, 2020, 1:17 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు ముందు టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్​ కోసం ఎంపికైన బౌలర్​ ఇషాంత్ శర్మ గాయం కారణంగా పూర్తిగా వైదొలగుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్​ మధ్యలోనే ఇషాంత్​ శర్మ నిష్క్రమించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలో పునరావాసంలో ఉంటూ సాధన చేస్తున్నాడు. ఇషాంత్​ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఫిట్​నెస్​ పట్టు సాధించకపోవడం వల్ల అతడిని టెస్టు సిరీస్​ కోసం తీసుకోవట్లేదని తెలుస్తోంది.

బ్యాకప్​ బౌలర్​గా నటరాజన్​

టెస్టు సిరీస్​లో రోహిత్​ శర్మ పాల్గొనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. అతడికి ఫిట్​నెస్​ పరీక్ష నిర్వహించిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు అతడు అర్హుడా? లేదా? అనే విషయం తెలుస్తుంది. ఐపీఎల్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు త‌ర‌ఫున రాణించిన పేసర్ న‌ట‌రాజ‌న్‌ను వ‌న్డే జట్టుకు ఎంపిక చేశారు. అయితే జట్టులోని బౌలర్ సైనీకి వెన్నునొప్పి కారణంగా నటరాజన్​ను బ్యాకప్​గా ఎంచుకున్నారు.

Last Updated : Nov 27, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.