ETV Bharat / sports

ధోనీకి కోపం తెప్పించిన బౌలర్ ఇషాంత్ శర్మ

author img

By

Published : Apr 20, 2020, 5:21 AM IST

గతేడాది ఐపీఎల్​లో ధోనీకి తనకు మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన గురించి పంచుకున్నాడు బౌలర్ ఇషాంత్ శర్మ. మహీకి కోపం తెప్పించిన వైనాన్ని గుర్తుచేసుకున్నాడు.

ధోనీకి కోపం తెప్పించిన బౌలర్ ఇషాంత్ శర్మ
ధోనీ ఇషాంత్ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి కెప్టెన్ కూల్​ అని పేరుంది. ఎందుకంటే మ్యాచ్​ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సహనం కోల్పోకుండా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం సహచరులపై కోపం ప్రదర్శిస్తుంటాడు. అయితే గతేడాది ఐపీఎల్​లో తనవల్ల ఓసారి అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పాడు ఇషాంత్ శర్మ. ఆ విషయం గురించి తాజాగా వివరణ ఇచ్చాడీ బౌలర్.

"నేను సిక్స్​లు కొట్టలేనని ధోనీభాయ్ అంటుండేవాడు. గతేడాది ఐపీఎల్​లోనూ ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ నీకంత బలం లేదని నాతో అన్నాడు. ఆ ఏడాది క్వాలిఫయర్​-2 తొలి ఇన్నింగ్స్​లో​ చివరి ఓవర్​ బౌలింగ్ చేసేందుకు జడేజా వచ్చాడు. వరస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టా. ఆ తర్వాత ధోనీ ముఖం చూశా. ఆ సమయంలో మహీ, జడ్డూవైపు కోపంగా చూస్తూ ఉన్నాడు" -ఇషాంత్ శర్మ, భారత సీనియర్ క్రికెటర్

ఈ మ్యాచ్​లో ఇషాంత్ ఆడుతున్న దిల్లీ క్యాపిటల్స్​పై చెన్నై సూపర్​కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ తర్వాత ముంబయి ఇండియన్స్​తో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది.​

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.