ETV Bharat / sports

ఐపీఎల్​2020: బయో బబుల్​ ఎంతవరకు భద్రం? - harbhajan singh

బయోబబుల్​ను ఏర్పాటు చేసి ఐపీఎల్​ను నిర్వహించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచించింది. యూఏఈకి వెళ్లే ముందు ఆటగాళ్లకు తగిన సూచనలూ చేసింది. కానీ, చెన్నై సూపర్​కింగ్స్​ శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది సిబ్బందికి కరోనా సోకడం.. రైనా, మలింగ, హర్భజన్​ సింగ్​ వంటి ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలగడం వల్ల బయో బబుల్​పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం​ విజయవంతం అవుతుందా? టోర్నీ నిర్వహణలో జాప్యం ఉంటుందా? అనే సందేహాలూ కలుగుతున్నాయి.

Is the IPL-2020's bio-bubble a safe zone?
ఐపీఎల్
author img

By

Published : Sep 6, 2020, 6:26 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) నుంచి కొంతమంది స్టార్​ ఆటగాళ్లు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబబుల్​పై వారికి నమ్మకం కుదరకపోవడం, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. ఐపీఎల్​ నుంచి ఇప్పటికే చెన్నై సూపర్​కింగ్స్​ ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా, ముంబయి ఇండియన్స్​ బౌలర్​ లసిత్​ మలింగ తప్పుకోగా.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు సీఎస్కే స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్​లో పాల్గొనలేక పోతున్నానని వెల్లడించాడు.

"బయోబబుల్​పై నమ్మకం లేనప్పుడు ఛాన్స్​ ఎందుకు తీసుకోవాలి? నాకు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. టోర్నీ ప్రారంభం నుంచి నేను స్వదేశానికి వచ్చే వరకు ఎలాంటి తప్పు జరగదని గ్యారెంటీ ఏంటి" అని ఐపీఎల్​ బయోబబుల్​పై రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లాండ్​లో బయోబబుల్​ విజయవంతం

జులై 8 నుంచి వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ ప్రారంభమైంది. ఈ సిరీస్​ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు నిర్బంధంలో ఉంటూ తరచుగా కొవిడ్​ టెస్టులు చేయించుకుని బయోబబుల్​లో అడుగుపెట్టారు. ఇందులో రెండు జట్ల ఆటగాళ్లు ఒకే హోటల్​, ఒకే స్టేడియాన్ని ఉపయోగించడం వల్ల వారిలో కరోనా కేసులను కట్టడి చేయగలిగారు.

Is the IPL-2020's bio-bubble a safe zone?
ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు

అదే విధంగా పాకిస్థాన్​తో ఇంగ్లాండ్ సిరీస్​కు ముందు పాక్​ జట్టులోని పది మంది క్రికెటర్లకు కరోనా సోకింది. వారందరిని 14 రోజులు నిర్బంధంలో ఉంచి పకడ్బందిగా ప్రణాళికలను అమలు చేయడం వల్ల ఈ సిరీస్​ కూడా విజయవంతమైంది. కానీ, ఐపీఎల్​ కోసం ఆటగాళ్లందరూ ఒకే ప్రదేశంలో కాకుండా మూడు నగరాల్లో ఉంటూ ప్రాక్టీసు కోసం రోజూ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆటగాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

బాస్కెట్​ బాల్​ ఆడుతున్న ఆటగాళ్లు

ఎన్​బీఏలోనూ ఇదే పరిస్థితి

జులై 30 నుంచి ప్రారంభమైన ప్రీమియర్​ లీగ్​ కోసం ఐదు వారల ముందు నుంచే సన్నద్ధమైంది నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​. ఆటగాళ్లకు తొలిసారి చేసిన పరీక్షల్లో 16 మందికి, రెండోసారి 9 మందికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు ఫ్లోరిడాలోని ఓర్లాండ్​ వాల్ట్​డిస్నీ వరల్డ్​ రిసార్ట్​లో ఆటగాళ్లను ఉంచి పకడ్బందీగా ప్రణాళికలు అమలుచేశారు. దీంతో టోర్నీ ప్రారంభం తర్వాత ఆగస్టు 19 వరకు ఐదుసార్లు జరిపిన కొవిడ్​ టెస్టుల్లో ఎవరికీ పాజిటివ్​గా నిర్ధరణ కాలేదు. కానీ, ఐపీఎల్​ కోసం ఎనిమిది జట్లు వేర్వేరు హోటళ్లను ఉపయోగించడం, వేర్వేరు నగరాల్లో ఉంటూ ప్రాక్టీసు కోసం మరో నగరానికి వెళ్లడం వంటివి జరుగుతున్నాయి. అందువల్ల ఈ సమస్య ఐపీఎల్​కు శాపంగా మారబోతుందని పలువురు అంటున్నారు.

అజాగ్రత్తే కారణమా?

కరోనా నేపథ్యంలో ఆటగాళ్లంతా ఒకచోట కలిసే ముందు కనీసం వారంపాటు నిర్బంధంలో ఉండాలనే నిబంధనను అన్ని ఫ్రాంఛైజీలు పాటించలేదు. యూఏఈ బయలుదేరే ముందు ఆటగాళ్లందరూ భారత్​లోనే స్వీయ నిర్బంధంలో ఉండగా.. సీఎస్కే ఆటగాళ్లు మాత్రం దానికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. రాజస్థాన్​, ముంబయి ఆటగాళ్లు పీపీఈ కిట్లతో తగిన జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణించారు. కానీ, సీఎస్కే ఆటగాళ్లు మాత్రం భౌతిక దూరం, మాస్క్​ ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలను విస్మరించారు.

చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు (పాతచిత్రం)

యూఏఈ బయలుదేరే ముందు సీఏస్కే తమను తాము నిర్బంధించుకోలేక పోయింది. అదే కాక శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. దీని వల్లే చెన్నై సూపర్​కింగ్స్​ శిబిరంలో కరోనా కలకలం సృష్టిందనేది క్రీడా విశ్లేషకుల వాదన.

నియంత్రణ ఉంటుందా?

ఆగస్టు 25న ఉసేన్​ బోల్ట్​కు కరోనా సోకగా.. జమైకాలోని కింగ్​స్టన్​లో అతడి పుట్టినరోజు వేడుకకు హాజరైన క్రిస్​ గేల్​ స్వీయనిర్బంధంలోకి వెళ్తున్నానని ప్రకటించాడు. క్వారంటైన్​ పూర్తయ్యాకే యూఏఈకి వచ్చాడు గేల్​. కానీ, కొన్ని నివేదికల ప్రకారం గేల్ నిర్బంధం పాటించకుండా​ ఓ యాడ్​ చిత్రీకరణకు వెళ్లాడని దానికి సంబంధించిన చిత్రాన్ని సోషల్​ మీడియాలో షేర్​ చేసి ఆ తర్వాత తొలగించాడని తెలుస్తోంది. ఇలాంటి వారి వల్ల​ బయోబబుల్​ విజయవంతంగా పూర్తవుతుందా? అనే అనుమానాలూ కలుగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.