ETV Bharat / sports

క్రికెట్లో ఏమిటి ఈ ఉమ్ము కథ? - ఉమ్ముకు క్రికెట్లో ప్రాథాన్యం

బంతిపై లాలాజలం రుద్దడాన్ని ఐసీసీ నిషేధించడం నేపథ్యంలో క్రికెట్లో ఉమ్ముకు అంత ప్రాధాన్యం ఉందా?బౌలర్లకు అంతగా మేలు చేస్తుందా? దానిపై నిషేధం ఆటపై అంతగా ప్రభావం చూపుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

cricket
క్రికెట్లో ఉమ్ముకు ప్రాధాన్యం
author img

By

Published : Jun 13, 2020, 7:17 AM IST

ప్రపంచంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో బంతిపై ఉమ్ముపూయడాన్ని ఐసీసీ నిషేధించింది. దీంతో పులువురు ఆటగాళ్లు, మాజీలు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో బంతికి సలైవా రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి? దానికి ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? దాని నిషేధం ఆటపై అంతగా ప్రభావం చూపుతుందా? వంటి విశేషాలపై ఓ లుక్కేద్దాం.

లాలాజలం.. ఎప్పుడు.. ఎందుకు?

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో బౌలర్లు ఫీల్డర్లు బంతికి లాలాజలం రాయడం, బంతిని ప్యాంటుకు అదే పనిగా రుద్దడం గమనిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు బౌలర్లు నుదుటి నుంచి చెమటనూ తీసి బంతికి రాస్తుంటారు. ఎక్కువగా టెస్టు మ్యాచ్‌ల్లోనే ఇలా జరుగుతుంటుంది. ఇదంతా బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసమే. అయితే ఆట ఆరంభం కాగానే బౌలర్లు, ఫీల్డర్లు ఈ పని చేయరు. కొత్త బంతి మామూలుగానే స్వింగ్‌ అవుతుంది. మామూలుగా ఫాస్ట్‌బౌలర్లు బంతిని బౌలర్లు చూపుడు, మధ్య వేళ్ల మధ్య సమాంతరంగా ఉండేలా పెట్టుకుని బౌలింగ్‌ చేస్తారు. అయితే ఆరంభ ఓవర్లలో సీమ్‌ పొజిషన్‌ కొంచెం పక్కకు తిప్పి, ఫస్ట్‌ స్లిప్‌ ఉండే దిశలో పెట్టి విసురుతారు. తొలి పది ఓవర్లలో బంతిపై ఉండే మెరుపు వల్ల ఈ సీమ్‌ పొజిషన్‌కు తగ్గట్లే బంతి స్వింగ్‌ అవుతుంది. తర్వాత బంతిపై మెరుపు పోయి గరుకుగా మారుతుంది. ఈ స్థితిలో ఉమ్ము వాడకం మొదలవుతుంది. బంతికి ఓవైపు ఉమ్ము రాసి, దాన్ని రుద్దుతుంటే.. మరోవైపు మెరుపు అలాగే ఉంటుంది. అప్పుడు సీమ్‌ను నేరుగానే పెట్టి బౌలర్లు బంతులేస్తారు. గరుకుగా ఉన్న వైపు బంతి స్వింగ్‌ అవుతుంది. 25 ఓవర్లు గడిచాక పరిస్థితి మారుతుంది. బంతికి ఇలాగే ఉమ్ము రాస్తూ ఉంటే తడి ఇంకి ఆ వైపు బరువు పెరుగుతుంది. అప్పుడు మెరుపున్న వైపే స్వింగ్‌ అవుతుంది. దాన్నే రివర్స్‌ స్వింగ్‌ అంటారు.

సమస్యంతా టెస్టుల్లోనే

ఉమ్ము అవసరం పడేది ఎక్కువగా టెస్టుల్లోనే. బ్యాట్స్‌మెన్‌ అందులో రక్షణాత్మకంగా ఆడతారు. అదే పనిగా షాట్లు ఆడరు కాబట్టి ఔటయ్యే అవకాశాలు తక్కువ. డిఫెన్స్‌ ఆడేవాళ్లను స్వింగ్‌తో ఇబ్బంది పెట్టాలని చూస్తారు బౌలర్లు. వన్డేలు, టీ20ల్లో అయినా ఆరంభ ఓవర్లలో బంతి స్వింగ్‌ అవుతుంది. స్లిప్‌లో క్యాచ్‌లు ఇస్తుంటారు. తర్వాత స్వింగ్‌ ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు. కానీ టెస్టుల్లో బంతి స్వింగ్‌ కాకుంటే ఫాస్ట్‌బౌలర్లకు వికెట్లు పడే అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే ఆటలో బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం పెరిగిపోతుండగా.. ఉమ్ముపై నిషేధం విధించిన నేపథ్యంలో బౌలర్లకు మరీ కష్టమైపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రత్యామ్నాయాలేంటి?

ఉమ్మును నిషేధించిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? చెమటను ఉపయోగించవచ్చు కానీ.. ఉమ్ముతో పోలిస్తే దాని ప్రభావం తక్కువ! పైగా శీతల దేశాల్లో ఆడుతున్నపుడు చెమటే పట్టదు. వ్యాజెలిన్‌ ఓ ప్రత్యామ్నాయం అవుతుందన్న చర్చ జరిగింది కానీ.. అది బంతి మెరుపును కాపాడుతుంది తప్ప స్వింగ్‌కు సహకరించదని ఆశిష్‌ నెహ్రా తదితరులు తేల్చేశారు. మరోవైపు ఓ సంస్థ మైనంతో తయారు చేసిన ఓ పదార్థాన్ని ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఇలా కృత్రిమ పదార్థాలేవీ ఉపయోగించడానికి వీల్లేదని ఐసీసీ తేల్చేసింది.

ఐసీసీ ఏమంటోంది?

కరోనా ముప్పు నేపథ్యంలో ఉమ్ము ప్రమాదకరం అంటున్న ఐసీసీ.. దీనిపై నిషేధం తాత్కాలికమే అన్న సంకేతాలిస్తోంది. ప్రత్యామ్నాయ పదార్థాల్ని అనుమతించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తే అదో సమస్య అని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌ అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ పిచ్‌పై పచ్చిక పెంచి బౌలర్లకు ప్రయోజనం చేకూర్చవచ్చని.. మెరుపు పోయాక బంతిపై స్పిన్నర్లకు బాగా పట్టు చిక్కుతుంది కాబట్టి ఒకరి బదులు ఇద్దరికి తుది జట్టులో చోటు కల్పించి లాభం పొందచ్చని అన్నాడు.

"క్రికెట్‌ బంతిపై ఉమ్ము రాయడాన్ని నిషేధిస్తే బౌలర్లు రోబోల్లా మారతారు"

- వసీమ్‌ అక్రమ్, ‌పాకిస్థాన్​ మాజీ పేసర్​.

"ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి లేకుంటే బంతికి, బ్యాటుకు పోరులో సమతూకం ఉండదు. బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం పెరిగిపోతుంది"

- ఇషాంత్‌ శర్మ, టీమ్​ఇండియా బౌలర్​.

ఇది చూడండి : 'కూల్​గా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.