భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కొత్త జెర్సీల్లో దర్శనమిచ్చారు. శుక్రవారం నుంచి జరగనున్న రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఇండియా లెజెండ్స్ జెర్సీలు వీరిద్దరూ ధరించారు. ఈ ఫొటోను ఇర్ఫాన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాతి ఫొటో అంటూ క్యాప్షన్ జతచేశాడు.
-
Post retirement pic. #brothers #love pic.twitter.com/ZZJzbkWvhM
— Irfan Pathan (@IrfanPathan) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Post retirement pic. #brothers #love pic.twitter.com/ZZJzbkWvhM
— Irfan Pathan (@IrfanPathan) March 4, 2021Post retirement pic. #brothers #love pic.twitter.com/ZZJzbkWvhM
— Irfan Pathan (@IrfanPathan) March 4, 2021
శుక్రవారం మొదలయ్యే ఈ దిగ్గజాల క్రికెట్లో తొలి మ్యాచ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. భారత జట్టుకు సచిన్ తెందుల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యూసుఫ్‌తో పాటు ఇర్ఫాన్ ఇండియా లెజెండ్స్ జట్టులో ఉన్నారు.
భారత్ తరఫున 57 వన్డేల్లో ఆడిన యూసుఫ్ 810 పరుగులు చేశాడు. 22 టీ20ల్లో 236 రన్స్ సాధించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచకప్ గెలుపొందిన జట్టులో యూసుఫ్ సభ్యుడు.
29 టెస్టులతో పాటు 120 వన్డేలు, 24 టీ20ల్లో టీమ్ఇండియాకు ఆడాడు ఇర్ఫాన్. అన్ని ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లతో పాటు 2821 పరుగులు సాధించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన టీమ్‌లో ఇర్ఫాన్ సభ్యుడు. 2020 జనవరిలో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.
ఇదీ చదవండి: మరో చెత్త రికార్డుతో ధోనీ సరసన కోహ్లీ