ETV Bharat / sports

'మేం సిద్ధమే.. పాక్ జట్టు మాత్రం చేతులెత్తేసింది' - India vs Pakistan 2007 T20 World Cup

2007 టీ20 ప్రపంచకప్​ విశేషాలు గుర్తు చేసుకున్న భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. పాక్​తో లీగ్​ మ్యాచ్​లో జరిగిన ఓ అనుహ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్​లో భారత్​కు కనీస పోటీ ఇవ్వలేకపోయిన పాక్
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్
author img

By

Published : Aug 14, 2020, 4:06 PM IST

2007 టీ20 ప్రపంచకప్​లో భారత్-పాకిస్థాన్ లీగ్ మ్యాచ్​. ఎవరు గెలుస్తారా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనుహ్యంగా మ్యాచ్​ 'టై' అయింది. సూపర్​ ఓవర్ కాకుండా బౌల్-అవుట్ పెట్టారు. అందులో ఎక్కువ వికెట్లు తీయడం వల్ల టీమ్​ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ పాక్​పై ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచింది. ఆ టోర్నీ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

"బౌల్-అవుట్ పెట్టే సమయానికి పాక్ క్రికెటర్లు అందుకోసం సిద్ధంగా లేరు. మేం మాత్రం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. వారి నుంచి కనీస పోటీ లేకపోవడం వల్ల గెలుపు మా సొంతమైంది"

-ఇర్ఫాన్ పఠాన్, మాజీ ఆల్​రౌండర్

ధోనీ కీలక నిర్ణయం...

"అప్పట్లో ప్రాక్టీస్​కు ముందు వార్మప్ చేసేవాళ్లం. కానీ బౌలింగ్ కోచ్ వెంకీ(వెంకటేశ్ ప్రసాద్) మాత్రం మాతో బౌల్-అవుట్ చేయించేవాడు. బ్యాట్స్​మెన్​లో సెహ్వాగ్, రోహిత్, నేను ఎక్కువగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ప్రపంచకప్​లో పాక్​తో మ్యాచ్​ 'టై' అవడం వల్ల మాకు చాలా ఆనందమేసింది. ఎందుకంటే దాదాపు ఓడిపోవాల్సిన మ్యాచ్​ను నిలబెట్టుకున్నాం. ఆ తర్వాత విజయం సాధించాం. ఈ విషయంలో పూర్తి ఘనత ధోనీదే. బౌలింగ్ ఎప్పుడూ వేయని నేను.. బౌల్ అవుట్ సమయంలో బంతి కావాలని అడిగినప్పుడు సరేనని నాకు అవకాశమిచ్చాడు" అని సీనియర్ క్రికెటర్ ఊతప్ప చెప్పాడు.

మ్యాచ్​లో భారత్‌ తరఫున వీరేందర్‌ సెహ్వాగ్‌, రాబిన్‌ ఊతప్ప, హర్భజన్‌ సింగ్‌ బంతులేసి ముగ్గురూ వికెట్లకు తాకించారు. పాక్‌ తరఫున అరాఫత్‌, ఉమర్‌ గుల్‌, షాహిద్‌ అఫ్రిది ముగ్గురూ విఫలమయ్యారు. దాంతో భారత్‌ విజేతగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.